కార్పొరేషన్,న్యూస్‌లైన్ : తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి మూడో రోజుకు చేరింది. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోధన్,కామారెడ్డి,ఆర్మూర్ ము న్సిపాలిటీలలో తడి,పొడి చెత్త సేకరణ అం తంతగానే జరుగుతుండగా,డ్రైనేజీలను శు భ్రం చేసేవారు,కాలనీలో చెత్తను సేకరించేవారే కరువయ్యారు.
ఫలితంగా వీధులలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోం ది. సమస్యలు పరిష్కరించాలనే డిమాం డ్‌తో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యూనియన్,ఏఐటీయూసీ యూని యన్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్టు,అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మె విరమణపై దృష్టి సారించని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయక పోవటంతో ‘పారిశుధ్య’ సమస్యలు పేరుకుపోతున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్‌లో సమ్మె తొలిరోజు శనివారం కార్మికులు రాస్తారోకోలు,నిరసనలు,మానవహారాలు నిర్వహించగా,రెండోరోజు ఆదివారం ఒక్క కార్మికుడు విధులకు హాజరుకాలేదు. సోమవారం కార్మికులు కార్పొరేషన్ కార్యాల యాన్ని ముట్టడించారు.
కీలక కార్మికులందరూ..
కాంట్రాక్టు,అవుట్‌సోర్సింగ్ కార్మికులతో పాటు,పర్మినెంట్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఇందులో డ్రైనేజీలు శుభ్రం చేసేవారు,చెత్తను సేకరించే వారు,రోడ్లు ఊడ్చే కార్మికులు,నీటి సరఫరా,వీధిలైట్లు,కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 750 మంది,ఆర్మూర్‌లో 105 మంది,బోధన్‌లో 471 మంది,కామారెడ్డిలో 260 మంది కార్మికులు పని చేస్తున్నారు.
పారిశుధ్య విభాగంలో కీలకమైన కాం ట్రాక్టు కార్మికుల సేవలు నిలిచి పోవటంతో పారిశుధ్య నిర్వహణ పనులు నిలిచి కాలనీలు కంపు కొడుతున్నా యి. అవుట్‌సోర్సింగ్,కాంట్రాక్టు కార్మికులు వేతనం రూ. 12,500 పెంచాలని,పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమ్మె చేస్తుండగా,పర్మినెంట్ కార్మికులు తమకు జీపీఎఫ్,సబ్బులు,నూ నె, దుస్తులు, రెగ్యులర్‌గా ఇవ్వాలని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు.
మరో రెండు రోజులు కొనసాగితే..
మరో రెండు రోజులు సమ్మెను కొనసాగిస్తే పట్టణాల లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారనున్నాయి. ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోవటంతో దోమలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. నగరం లో ఓ యూనియన్‌కు చెందిన 38 మంది కార్మికులు మాత్రం సమ్మెకు దూరంగా ఉండటంతో అధికారులు వారితో కొంత వరకు మాత్రమే పనులు వెల్లదీస్తున్నారు.
కాలనీలు.. కంపు..కంపు
Published Tue, Feb 11 2014 5:01 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement