తెల్లబంగారం ధర ఢమాల్ | cotton prices decreased | Sakshi
Sakshi News home page

తెల్లబంగారం ధర ఢమాల్

Published Tue, Jan 28 2014 5:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

cotton prices decreased

జమ్మికుంట, న్యూస్‌లైన్: జమ్మికుంట  పత్తి మార్కెట్‌కు సోమవారం మనజిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పత్తి అమ్మకానికి తీసుకువచ్చారు.  సంక్రాంతి పండుగ తర్వాత ధరలు పెరుగుతాయనే ఆశతో 82 వాహనాల్లో లూజ్ పత్తిని సైతం తీసుకువచ్చారు. వ్యాపారు లు క్వింటాల్ లూజ్ పత్తికి గరిష్ట ధర రూ. 4,930 చెల్లించినా అధికంగా క్వింటాల్‌కు రూ.4,700 మాత్రమే పలికింది. కనిష్ట ధర రూ. 3,900 చెల్లించారు. మూడు వేల బస్తాల్లో పత్తి రాగా క్వింటాల్‌కు రూ. 4,760 పలికింది. కనిష్ట ధర రూ.3,700 వరకు చెల్లించారు.

 వారంలో తగ్గిన రూ.500.
 వారం క్రితం లూజ్ పత్తి ధర రూ.5,180 వరకు పలికింది. క్రమంగా ధరలు తగ్గుతూ సోమవారం రూ.4,900 నుంచి రూ.3,900 వరకు ధరలు పడిపోయాయి. ఈ లెక్కన రైతులు క్వింటాల్‌కు రూ.500 వరకు నష్ట పోయారు. రానురాను ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్యాండీ, గింజల ధరల్లో డిమాండ్ పడిపోవడం వల్లనే ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement