తాడిపత్రి టౌన్(అనంతపురం): ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం నాడు సమస్యల పరిష్కరించాలంటూ ఆయన ధర్నా చేపట్టారు. స్థానిక మూడోవార్డులోని అడ్డువారి వీధిలో నీరు, పారిశుధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని పరిష్కరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మి, కమిషనర్ శివరామకృష్ణకు స్థానిక కౌన్సిలర్ మున్నా పలుమార్లు విన్నవించారు.
అయితే, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవటంలేదంటూ స్థానిక కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు.సమస్యలను పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆయన ధర్నా సాగిస్తున్న అడ్డువారి వీధికి అధికారులు తరలివెళ్లారు.
ప్రజా సమస్యలపై కౌన్సిలర్ ధర్నా
Published Wed, Sep 16 2015 3:40 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement