
విచారణ జరపకుండానే థర్డ్ డిగ్రీ ప్రయోగించే..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా పోలీసులు మరోసారి దాడికి దిగారు. వైఎస్సార్‌సీసీ కార్యకర్తలపై జులూం ప్రదర్శించారు. చిన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లాఠీలతో కుళ్లపొడిచారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ వారిని ఆస్పత్రికి పంపకుండా కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు దాష్టికాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. విచారణ జరపకుండానే థర్డ్ డిగ్రీ ప్రయోగించే హక్కు ఎవరిచ్చారని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీఐ నారాయణరెడ్డి బదిలీ అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.