
గుంటూరు జిల్లాలో ఆయుధాల వ్యాపారం
శావల్యాపురంలో తపంచాల వ్యాపారం అంశం కలకలం రేపింది. గుంటూరు జిల్లా వినుకొండలో అమ్మేందుకు రెండు తపంచాలను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శావల్యాపురంలో తపంచాల వ్యాపారం అంశం కలకలం రేపింది. గుంటూరు జిల్లా వినుకొండలో అమ్మేందుకు రెండు తపంచాలను తీసుకెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు, తుపాకుల వాడకాలు పెరిగిపోయాయి. గంజి మురళీధరరావు అనే వ్యక్తి తుపాకుల వ్యాపారం చేయాలని భావించి, పానీపూరీ విక్రయించే సందీప్కుమార్ అనే వ్యాపారిని సంప్రదించాడు.
అతడి ద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన సుధీర్ కుమార్ను కలిసి, ఒక్కోటీ రూ. 30 వేల చొప్పున రెండు తపంచాలు కొన్నాడు. వినుకొండలోని ఓ వ్యాపారికి వీటిని విక్రయించేందుకు మారుతి కారులో తీసుకెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీరి కారును కూడా తనిఖీ చేయగా, రెండు తపంచాలు దొరికాయి. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. గతంలో కూడా వీళ్లు ఈ తరహా వ్యాపారం చేశారని తెలిసింది.