పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలి
Published Thu, Aug 22 2013 2:44 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
కనగల్, న్యూస్‌లైన్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కేంద్రా న్ని డిమాండ్ చేశారు. బుధవారం పొనుగోడులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రుల లాబీలకు తలొగ్గి తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిశంబర్ 9 ప్రకటన తర్వాత చంద్రబాబు అనుసరించిన విధానాన్నే ప్రస్తుతం కూడా అనుసరిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్‌లో భద్రత ఉండదని చెబుతూ కొంతమంది సీ మాంధ్ర పెట్టుబడి దారులు ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయించడం ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి రాష్ట్రకార్యదర్శి నారాయణ హాజరౌతున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జి. సోమయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement