
'అది తప్ప మరో మాట రాదా'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోటి వెంట రాజధాని మాట తప్ప మరొకటి రావడం లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా వారి గోడు పట్టించుకోవట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేస్తానన్న బాబు.. కేవలం విదేశీ పర్యటనలకు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన.. పట్టిసీమ ప్రాజెక్టు గురించి వాస్తవాలను మాట్లాడే వారిని రాయలసీమ వ్యతిరేకులుగా పేర్కొనడంపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి పెరిగిందని, ప్రాజెక్టులపై చర్చిందేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.