అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంతా ఒకే చోట జరిగితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల మధ్య మళ్లీ వైషమ్యాలు పెరుగుతాయని రామకృష్ణ విమర్శించారు.
అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రామకృష్ణ... చంద్రబాబుకు సూచించారు. అలాగే డబ్బులు లేవంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయిలు దుబారా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ఈ సందర్బంగా రామకృష్ణ వ్యాఖ్యానించారు.