ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పంటనష్టం వాటిల్లింది.
సాక్షి నెట్‌వర్క్: ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పంటనష్టం వాటిల్లింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని వరి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, మామిడి, అరటి, బొప్పాయి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి. విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి.
విద్యుత్ స్తం భాలు నేలకొరిగాయి. అనంతపురం జిల్లాలో అరటి, బొప్పాయి, మామిడి, వరి, పత్తి, కూరగాయలు, ఆకు, వక్కతోటలకు నష్టం వాటిల్లింది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో సూళ్లూరుపేట- గుమ్మిడిపూండి రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పిడుగులు రైల్వేలైన్‌పై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది