ఐటీ ఉద్యోగులపై 'ట్రాఫిక్' ఆంక్షలు | Cyberabad Trophic police restrictions on IT Companies Vehicles | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులపై 'ట్రాఫిక్' ఆంక్షలు

Published Fri, May 9 2014 5:14 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఐటీ ఉద్యోగులపై 'ట్రాఫిక్' ఆంక్షలు - Sakshi

హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసుల్ని గట్టేక్కించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కా చర్యలు చేపడుతున్నారు.  ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే భాగంగా ఐటీ కంపెనీల వాహనాలపై ఆంక్షలు విధించారు.
 
సైబరాబాద్‌ పరిధిలో Q&R కోడ్‌ స్టిక్కర్లున్న వాహనాలలోనే ఐటీ ఉద్యోగులు ప్రయాణించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. Q&R స్టిక్కర్ లేనివారికి 500 రూపాయల వరకు జరిమానా విధిస్తామని సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌ హెచ్చరించారు. 
 
'అభయ' తరహా కేసులు పునరావృతం కాకుండా 5 సూత్రాల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ఆనంద్‌ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై అత్యాచారం జరిగిన సంఘటన జంట నగరాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
 
నేరాలను ఆరికట్టేందుకు, ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 6 కోట్లతో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆనంద్ మీడియాకు వెల్లడించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement