
జగన్‌కు సమస్యలను విన్నవించుకున్న మేస్త్రి సానా సతీష్ తదితరులు
కాకినాడ రూరల్ ప్రాంతంలో వ్యవసాయ పనులు తగ్గిపోతున్నాయని, రానున్న రోజుల్లో వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయని తమ సమస్యలను చెప్పుకున్నారు వ్యవసాయ కూలీల మేస్త్రి సానా సతీష్. కొవ్వాడలో సహచర కూలీలతో జగన్‌ను కలిసి కూలీల స్థితిగతులను చెప్పారు. ఉపాధి పనుల్లో వంద రోజుల పని నియమాన్ని అమలు చేయడంలేదని, దీంతో ఇతర వృత్తులకు వలసలు పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.