తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి | Daughter died, beside mother's deadbody over wall falls | Sakshi
Sakshi News home page

తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి

Published Sat, Nov 23 2013 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి

తల్లి శవం పక్కనే.. కుమార్తె సజీవ సమాధి

కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌లైన్: తల్లి మృతి చెందడంతో కడసారి చూపు కోసం పరుగున వచ్చిన కుమార్తె అక్కడ రోదిస్తుండగానే... గోడకూలి తల్లి శవం పక్కనే సజీవ సమాధి అయింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లెకి చెందిన పొవారి రాయమల్లమ్మ(85)అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వరంగల్ జిల్లా మొగుల్లపల్లి మండలం చింతలపల్లె గ్రామంలో ఉంటున్న కుమార్తె రాధమ్మ తల్లిని కడసారి చూసుకునేందుకు రాత్రికి ఆరెపల్లెకు చేరుకుంది.
 
 శుక్రవారం ఉదయం రాయమల్లమ్మ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు మృతదేహం పక్కనే కూర్చున్న వారందరూ లేచి ముందుకు వచ్చారు. రాధమ్మ తల్లి మృతదే హం పక్కనే రోదించసాగింది. పక్కనే ఉన్న సిమెంట్ గోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో రాధమ్మ ఆ గోడ శిథిలాల కింద ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలై ఊపిరాడకపోవడంతో శిథిలాలను తొలగించేలోపే ఆమె చనిపోయింది. సిమెంట్ గోడ అవతలివైపు ఇసుక పోశారు. ఇటీవల వర్షాలకు ఇసుక తడిసి బరువెక్కింది. దీంతో గోడ ఒక్కసారిగా కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే తల్లీబిడ్డలు మృతి చెందడంతో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement