'అసైన్డ్ భూములపై త్వరలో నిర్ణయం'
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని 919 ఎకరాల అసైన్డ్ భూములపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. మంగళవారం ఆయన ఎన్‌టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవాలంటే తాము ఎపుడో భూ సేకరణ చట్టం తెచ్చే వాళ్లమని, అందరినీ ఒప్పించి భూ సమీకరణ ద్వారానే భూములను సేకరించాలనేది తమ ఉద్ధేశ్యమని చెప్పారు.
రైతులను, ప్రజలను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించవద్దని సూచించారు. రైతుల పంట పొలాలను ద గ్థం చేసిన ఘటనపై విచారణ మొదలైందని, దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామని తెలిపారు.