సొంత సర్కారుపై అవిశ్వాసం పెట్టచ్చా?: టీ ఎంపీలు | defying own party is not good, say telangana MPs | Sakshi
Sakshi News home page

సొంత సర్కారుపై అవిశ్వాసం పెట్టచ్చా?: టీ ఎంపీలు

Published Mon, Dec 9 2013 4:40 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

defying own party is not good, say telangana MPs

కాంగ్రెస్ పార్టీలో ఎదిగి.. పార్టీని సొంత ఎంపీలు మోసం చేయడం దారుణమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య అన్నారు. అసలు అధికారపక్షంలో ఉండి, సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవచ్చో లేదో సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి తదితరులు తెలుసుకోవాలని వారు అన్నారు.

యూపీఏ ప్రభుత్వంపై సబ్బం హరి తదితర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సందర్భంగా టీ ఎంపీలు స్పందించారు. సొంత పార్టీ మీద విరుచుకుపడే ముందు, అసలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటిముందు వాళ్లు ఎందుకు ధర్నా చేయట్లేదని పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement