నిజామాబాద్, న్యూస్‌లైన్: బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని డి మాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో శుక్రవారం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు వ్యాపార సముదాయాల ను మూసివేశారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా కమిటీ అధ్యక్షులు మౌలానా స య్యద్ వలీఉల్లా ఖాస్మీ మాట్లాడుతూ కొందరి మతవాదుల దుశ్చర్యవల్ల 6 డిసెంబర్ 1992న ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయ్యిందన్నారు.
ఆ చర్యను నిరసిస్తూ ప్రతి ఏడు బ్లాక్‌డే నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ము స్లిం పర్సనల్ లా కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ మన్జూర్ అహ్మద్, మహ్మద్ ఫాజిల్ అహ్మద్, ఎంఏ.ఖాదర్, మహ్మద్ యూసూఫ్, హబాబ్‌అహ్మద్, డమీరోద్దీన్, రహ్మతుల్లా ఖాన్ అల్మాస్, తదితరులు పాల్గొన్నారు.