muslims rally
-
Up: బరేలీలో ఉద్రిక్తత.. జ్ఞానవాపిపై జైల్‌భరోకు పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణిచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్ రజా శుక్రవారం జైల్ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు. దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురి మృతి -
హైదరాబాద్‌లో ముస్లింల తిరంగా ర్యాలీ
-
హైదరాబాద్‌లో ముస్లింల తిరంగా ర్యాలీ
-
హైదరాబాద్‌లో ముస్లింల తిరంగా ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్‌లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు తిరంగా ర్యాలీ చేపట్టారు. మీర్ ఆలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు తిరంగా ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో భారీగా ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ధర్మవరంలో ముస్లింల ఆత్మీయ సదస్సు
-
ఇస్తెమాకు పోటెత్తిన జనం!
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఏపీలోని కర్నూలు నగర శివారు నన్నూరు టోల్గేట్ వద్ద నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు శనివారం జనం పోటెత్తారు. దేశ విదేశాల నుంచి ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయి ఇస్తెమాకు హాజరవుతున్న వారికి సేవలందించేందుకు స్థానిక ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. శనివారం హజ్రత్‌జీతో పాటు మౌలానా జంషేద్, మౌలానా యూసుఫ్, ముఫ్తి షాజాద్, భాయ్ ఇక్బాల్ హఫీజ్, మౌలానా ముస్తఖీమ్, మౌలానా సయీద్, మౌలానా షౌకత్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇస్తెమా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతీరోజు మగ్రిబ్ నమాజ్ తర్వాత హజ్రత్‌జీ బయాన్ ఉంటుందని తెలిపారు. నేడు సామూహిక వివాహాలు ఆదివారం సాయంత్రం అసర్ నమాజు తర్వాత ఇస్తెమాయీ షాదియాన్ (సామూహిక వివాహాలు) నిర్వహించనున్నట్లు ఇస్తెమా కమిటీ సభ్యులు తెలిపారు. హజ్రత్‌జీ సమక్షంలో రెండు వందలకు పైగానే నిఖాలు జరుగుతాయని తెలిపారు. -
పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
ముస్లిం యువకుల అరెస్ట్ అన్యాయం
నంద్యాల(కర్నూలు): న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం అన్యాయమని వైఎస్సార్సీపీ నేతలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ అన్నారు. నారా హహమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకున్న 8 మంది ముస్లింలు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో, వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం రాత్రి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శిల్పా, హఫీజ్‌ఖాన్‌మాట్లాడుతూ ..నాలుగున్నరేళ్ళ పాలనలో కనిపించని ముస్లింలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కనిపించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సభలో ప్లకార్డులు పట్టుకుంటే దేశద్రోహం కేసు అయినట్లు యువకులను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ముస్లింలపై చంద్రబాబుకు ఏ పాటి ప్రేమ ఉందో ఈ సంఘటన తెలియజేస్తోందన్నారు. వక్స్ భూముల పరిరక్షించాలని కోరడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. హిట్లర్‌లా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం ఇచ్చిన హామీలు నెరవెర్చలేదన్నారు. నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో జతకట్టి, ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్లు పడవని బీజేపీతో దూరంగా ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన యువకులను బేషరతుగా విడుదల చేసి నంద్యాలకు పంపకపోతే అధికారపార్టీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ యువజన విభాగం అధ్యక్షుడు పీపీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువకుల అక్రమ అరెస్ట్‌ను ప్రతి ఒక్కరు నిరసించాలన్నారు. ఇలాంటి చర్యలకు దిగితే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముస్లింలకు అండగా వైఎస్సార్సీఈపీ ఉంటుందని, ఎవరూ అందోళన చెందల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ చేసిన యువకులను వెంటనే విడుదల చేయకపోతే భారీ ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు ఇస్సాక్ బాషా, కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, జాకీర్ హుసేన్, సుబ్బరాయుడు, శోభారాణి, నాయకులు జగన్ ప్రసాద్, పాంషావలి, టైలర్‌శివ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముస్లింల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్నది కపటప్రేమేనని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా, టీడీపీ హమారా’ కార్యక్రమంలో ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడాన్ని జీర్ణించుకోలేక తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనకు నిరసనగా బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటినుంచీ ముస్లింల వ్యతిరేకి అని, వారికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్ మాట్లాడుతూ నచ్చని అంశాలపై నిరసన తెల్పుకోవడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కన్నారు. గుంటూరులో అరెస్టు చేసిన ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు ధనుంజయాచారి, ఫిరోజ్, జమీల, సలోమి, సపియా ఖాతూన్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, ఖాదర్‌ఖాన్, నజీర్‌అహ్మద్‌ఖాన్, గఫూర్‌ఖాన్, సయ్యద్ ఆసిఫ్, శ్రీనివాసరెడ్డి, మాధవస్వామి, గణపచెన్నప్ప, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో ‘బ్లాక్‌డే’ ర్యాలీ
భువనగిరి: బ్లాక్ డే సందర్భంగా మంగళవారం భువనగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి రైతు బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ముస్లిం సంస్థలు డిసెంబర్ 6 ను బ్లాక్‌డేగా పాటిస్తున్న విషయం విదితమే. -
బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి
నిజామాబాద్, న్యూస్‌లైన్: బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని డి మాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో శుక్రవారం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు వ్యాపార సముదాయాల ను మూసివేశారు. ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా కమిటీ అధ్యక్షులు మౌలానా స య్యద్ వలీఉల్లా ఖాస్మీ మాట్లాడుతూ కొందరి మతవాదుల దుశ్చర్యవల్ల 6 డిసెంబర్ 1992న ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయ్యిందన్నారు. ఆ చర్యను నిరసిస్తూ ప్రతి ఏడు బ్లాక్‌డే నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో ము స్లిం పర్సనల్ లా కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ మన్జూర్ అహ్మద్, మహ్మద్ ఫాజిల్ అహ్మద్, ఎంఏ.ఖాదర్, మహ్మద్ యూసూఫ్, హబాబ్అహ్మద్, డమీరోద్దీన్, రహ్మతుల్లా ఖాన్ అల్మాస్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో బ్లాక్ డే.. నిరసన ర్యాలీలు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : బాబ్రీమసీద్ కూల్చివేత దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో ముస్లింలు, వివిధ సంఘాల నాయకులు బ్లాక్ డేగా పాటించారు. లౌకికవాద దేశంలో ఇలాంటి సంఘటన జరగడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంబీటీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వీధుల గుండా మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో ఎస్ఎస్ రాజుకు వినతిపత్రం అందజేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేసిన స్థలంలోనే పునర్నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. ఎంబీటీ జిల్లా అధ్యక్షుడు ఆయాజ్ అహ్మద్ షమా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్వర్, పట్టణ అధ్యక్షుడు అక్తర్‌ఖాన్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్‌లో మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్‌లో ముస్లింలు ధర్నా నిర్వహించి సబ్‌కలెక్టర్ ప్రశాంత్పాటిల్కు వినతిపత్రం అందజేశారు. భైంసాలో ముస్లింలు దుకాణాలు బంద్ చేసి బ్లాక్ డే పాటించారు. మంచిర్యాలలో రైల్వేస్టేసన్ నుంచి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్‌లో ఎంఐఎం నాయకులు అభిందిన్ మాఫియా, అజర్, నాయకులు, జమాతే ఉల్మ్ హింద్ సయ్యద్ అజార్, వసీం, అహ్మద్ ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్‌లో ఎన్టీర్ చౌక్ నుంచి ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహశీల్దార్ కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6ను మతతత్వ దినంగా పరిగణించాలని దిష్టిబొమ్మ దహనం చేశారు. బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి ఆసిఫాబాద్ : బాబ్రీ మసీద్ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట శెరియత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు ఎంఏ వాహబ్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శేక్ ఇబ్రహీం, సయ్యద్‌జాఫర్, ఎండి.ఇస్మాయిల్, షబ్బీర్, ఎండివజీర్, ఎస్కే చాంద్, సయ్యద్ జావిద్, సయ్యద్ అన్సార్, ముస్లింలు పాల్గొన్నారు. -
తాండూరులో ముస్లింల భారీ ర్యాలీ
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలో ముస్లింలు శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండా లు పట్టుకుని స్థానిక రైల్వే స్టేషన్ నుంచి శాంతమహల్ చౌరస్తా మీదుగా ఇందిరాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. మతతత్వ శక్తుల మూలంగా పవిత్రమైన మసీదు నాడు కూల్చివేతకు గురైందని చెప్పారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కూల్చివేసిన స్థానంలోనే నూతనంగా మసీదును నిర్మించాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఖుర్షీద్ హుస్సేన్, ఎంఏ అలీం, హబీబ్‌ఖాన్, హాది, ఆయూబ్‌ఖాన్, ముక్తార్, అసద్‌అలీ, అహ్మద్, సాబేర్, బాసిత్అలీ తదితరులు ఉన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పట్టణంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మసీద్‌ల వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. పరిగి పట్టణంలో.. పరిగి : బ్లాక్ డే సందర్భంగా శుక్రవారం పరిగి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మజీద్ల దగ్గర స్థానిక పోలీసులతో అదనపు బలగాల సాయం తీసుకున్నారు. ప్రత్యేక టీంలతో రోజంతా పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు లకా్ష్మరెడ్డి, శివప్పలు బందోబస్తు పర్యవేక్షించారు. శంషాబాద్: పట్టణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో మార్చ్ నిర్వహించారు. బ్లాక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముస్లిం సోదరులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. -
జనమే జనం
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఆమరణదీక్ష చేపట్టిన జగన్‌కు మద్దతుగా సింహపురి జనం కదం తొక్కారు. అండగా తామున్నామంటూ నినదిం చారు. చంచలగూడ జైల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరదీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో, ర్యాలీలు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం తదితర ఆందోళ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నియోజకవర్గం వ్యాప్తంగా ర్యాలీలు,నెల్లూరులో పార్టీ సిటీ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. గూడూరు సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. వీటితోపాటు జగన్‌కు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆమరణ, రిలేదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల్లూరులో వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో జగన్‌కు మద్దతుగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరురూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన సోనియా కొడుకు రాహుల్‌ను ప్రధాని చేసుకునేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. గూడూరు సమన్వయకర్త డాక్టర్ బాలచెన్నయ్య చేస్తున్న ఆమరణ దీక్షను నాల్గో రోజు పోలీసులు భగ్నం చేశారు. అనంతరం బాలచెన్నయ్యను గూడూరు ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని ఆస్పత్రి రోడ్డులో పాతమోతిమహల్ కూడలి ప్రాంతం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు బత్తిని విజయ్‌కుమార్ చేపట్టిన రిలేదీక్ష నాల్లో రోజుకు చేరింది. ఈ దీక్షకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి జగన్ దీక్షకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉదయగిరిలో బస్టాండ్‌లో వికలాంగులు రిలే నిరాహార దీక్ష చేశారు. సీతారామపురం బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేశారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య, స్టీరింగ్‌కమిటీ సభ్యుడు పర్వతరెడ్డి కవిత ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారం వేసి మహిళలు గొబ్బిళ్లు తట్టడం, రోడ్లు చిమ్మడం వంటి పనులతో నిరసన వ్యక్తం చేశారు. సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్‌పేటలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. హసనాపురంలో సైతం కార్యకర్తలు రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. మర్రిపాడులో వైఎస్సార్సీపీ నాయకుడు బిజివేముల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీపీగూడూరు మండలంలోని కాకుపల్లిలో పార్టీ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. పొదలకూరులో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభించారు. వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ నాయకుడు అనిల్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. సైదాపురం బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకుడు మహేంద్రరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు.కావలి గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు పూనూరు శివకుమార్‌రెడ్డి, లింగం మాల్యాద్రి, తదితరులు రిలేనిరాహారదీక్ష చేపట్టారు.