
‘పెద్దనోట్ల రద్దు నల్లధనంపై యుద్ధమే’
విజయవాడ : పెద్దనోట్ల రద్దు నల్లధనంపై యుద్ధమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు తాత్కాలికమే అని అన్నారు. నోట్ల రద్దుపై కావాలనే విపక్షాలు రాద్ధాంత చేస్తున్నాయని మురళీధరరావు విమర్శించారు.
పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ వేగం తగ్గిందన్నారు. ఈ ప్రభావం అనేక రంగాలపై పడినా, అది తాత్కాలికమే అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అంశంతో పాటు రాజకీయ పార్టీలకు డొనేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మురళీధరరావు అన్నారు.