ఒంగోలు కల్చరల్ : ఒంగోలులోని టీటీడీ కల్యాణమండపంలో తెలుగు రచయితల స్వర్ణోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శాసనమండలి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ తెలుగు లోగిలి’ అనే 11 వందల పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన 6 ఆరుగురు భాషావేత్తలను నిర్వాహకులు సత్కరించారు. వీరిలో వరంగల్(తెలంగాణ), అనంతపురం(ఆంధ్రప్రదేశ్), బరంపురం(ఒడిశా), చెన్నై(తమిళనాడు), బెంగళూరు(కర్ణాటక), ముంబై(మహారాష్ట్ర)లకు చెందినవారున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రొఫెసర్ కొలకనూరి ఇనాక్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, సంఘం అధ్యక్షుడు బి.హనుమారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఒంగోలులో రచయితల స్వర్ణోత్సవాలు ప్రారంభం
Published Fri, Jan 8 2016 9:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement