
జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం.
ూచిపూడి(అమృతలూరు)
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున శుక్రవారం అన్నారు.
నాలుగో రోజు గడపగడపకూ వైఎ స్సార్‌సీపీ ప్రచారంలో భాగంగా భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఇంటింటికీ తిరిగారు. పార్టీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలు, కార్యక్రమాలు వివరిం చారు. ఆరోగ్యశ్రీ పూర్తిస్థాయిలో అమలు, పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందేలా పార్టీ కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గాజుల వర్తి బెన్హర్, యువజన విభాగ మండ కన్వీనర్ గర్నెపూడి అజయ్‌కుమార్, వీవర్స్ సొసైటీ అధ్యక్షుడ బట్టు వీరాస్వామి, నాయీబ్రాహ్మణ సంఘ జిల్లా కార్యదర్శి వక్కలగడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చవ్వాకుల రాఘవరావు, కూచిపూడి మోషే, ఇంటూరు, తురుమెళ్ళ సర్పం చులు బట్టు మోషే, పేర్ల వెంకట సుబ్బారావు, పార్టీ నాయకులు యల వర్తి రామ్మోహనరావు, యలవర్తి సురేష్ పాల్గొన్నారు.