ఆత్మకూరు : రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధే మనందరి పార్టీ అనే విధంగా పనిచేద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలను ఆదివారం ఆయన ప్రారంభించా రు. అనంతరం నెల్లూరు-ముంబయి రహదారిపై 45.95 కిలోమీటర్ల
-కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సీసీ రోడ్డు నిర్మాణాలను నెల్లూరుపాళెంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సిద్ధాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా అందరి ధ్యేయం సమాజ అభివృద్ధేనని తెలిపారు.
ప్రజలు ప్రజాసేవ చేసేందుకు తీర్పునిచ్చారని ప్రజాప్రతినిధులందరినీ సమష్టిగా గౌరవించాలన్నారు. తాను ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యానన్నారు. గెలుపొంది ఉంటే ఆత్మకూరుకే పరిమితం అయి ఉండేవాడినని, ఓ రకంగా ఈ ప్రాంతీయులు తనకు మేలు చేశారన్నారు. ప్రస్తుతం హస్తినలో ఉంటూ కేంద్ర మంత్రిగా దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానన్నారు. తాను గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాను అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా అభివృద్ధి కోసం తనతో పాటు మంత్రి నారాయణ కూడా కృషి చేస్తున్నారన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి గూటూరు కన్నబాబు, బీజేపీ నేతలు కూడా ఇందుకు సహకరిస్తున్నారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యా సంస్థలు నెలకొల్పడంలోనూ కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యరంగాల్లో మరింత బడ్జెట్ పెంచాల్సి ఉందన్నారు.
ఆత్మకూరు అభివృద్ధి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఆయన పరోక్షంగా దుయ్యబట్టారు. ప్రస్తుతం ఓపికలేని నేతలు కొందరు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. చైనా, రష్యాలో వర్షం కురిస్తే మన దేశంలో గొడుగు పట్టే మరికొందరు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విచారకరమన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూటూరు మురళీ కన్నబాబు, బీజేపీ నేతల కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, రమణయ్య నాయుడు, కె.సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధులు మల్లు సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవరపలి శ్రీనివాసులురెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, కలెక్టర్ ఎం.జానకి, ఏపీఎంఐఎస్‌డీసీ ఎండీ ఎం.రవిచంద్ర, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ కనకదుర్గ, వందపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాల్యాద్రి, మున్సిపల్ చైర్‌పర్సన్ వన మ్మ, వైస్ చైర్మన్ సందానీ, ఆర్డీఓ వెంకటరమణ, తహశీల్దార్ బీకే వెంకటేశులు, ఎంపీడీఓ నిర్మలాదేవి పాల్గొన్నారు.
అభివృద్ధే ‘పార్టీ’గా పనిచేద్దాం
Published Mon, Feb 9 2015 2:49 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement