రాత్రికి రాత్రే అభివృద్ధి జరగదు: వెంకయ్య | venkaiha naidu comments on development | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే అభివృద్ధి జరగదు: వెంకయ్య

Published Sat, Dec 5 2015 1:10 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

రాత్రికి రాత్రే అభివృద్ధి జరగదు: వెంకయ్య - Sakshi

రాత్రికి రాత్రే అభివృద్ధి జరగదు: వెంకయ్య

విజయవాడ: ప్రపంచం భారత్‌ వైపు చూస్తున్నదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత శక్తివంతంగా మారబోతున్నదని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో కనకదుర్గ దేవాలయం వద్ద శనివారం ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రాష్ట్రానికి అనేక ఓడ రేవులు రానున్నాయని చెప్పారు. అభివృధ్ది అనేది రాత్రికి రాత్రి జరగదని, ఇందుకు కొంత సమయం పడుతుందని ఆయన తనదైన శైలి పేర్కొన్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్‌ను నంబర్ వన్‌గా నిలబెట్టాలన్నదే మోదీ లక్ష్యమని చెప్పారు. ఏపీకి సంబంధించిన నూతన జాతీయ రహదారిని ఆమోదిస్తున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడ చుట్టూ నిర్మించనున్న 180 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డుకు రూ. 20వేల కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement