59 సంస్థల విభజన పూర్తి
రెండు రాష్ట్రాలకు ఆస్తులు, అప్పుల పంపిణీఆడిట్ కారణంగా మరో 31 సంస్థల విభజనలో జాప్యం
ఆగస్టు 15 కల్లా ఆడిట్ పూర్తి చేయమని ఆదేశం షీలాభిడే కమిటీ స్పష్టీకరణ
రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూషన్‌ల విభజనకు, ఆస్తులు, అప్పులు పంపిణీపై ఏర్పాటైన షీలాభిడే కమిటీ ఇప్పటి వరకు 59 సంస్థల విభజనను పూర్తి చేసింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. సంబంధిత వివరాలతో షీలాభిడే కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 31 సంస్థల విభజన జాప్యానికి ప్రధాన కారణం ఆడిట్ పూర్తి చేయకపోవడమేనని కమిటీ పేర్కొంది. ఆడిట్‌ను ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తి చేయాల్సిందిగా ఆ సంస్థల ఎండీలకు స్పష్టం చేసినట్లు కమిటీ తెలిపింది. ఆయా సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- సాక్షి, హైదరాబాద్
విభజన పూర్తైన సంస్థలు
ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ, ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్, ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ఏపీ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ స్టేట్ ఆస్తి పన్ను మండలి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ, ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ సహకార చక్కెర ఫ్యాక్టరీల ఫెడరేషన్, ఏపీ మీట్ అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్, ఏపీ మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్, రాష్ర్ట స్పోర్ట్స్ అధారిటీ, ఏపీ రోడ్డు అభివృద్ది సంస్థ, ఏపీ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ గీత కార్మికుల సహకార సొసైటీ, ఏపీ పట్టణ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ వాల్మీకి, బోయ సహకార సొసైటీ, ఏపీ విశ్వబ్రాహ్మణ సహకార సొసైటీ, ఏపీ కృష్ణ బలిజ సహకార సొసైటీ, ఏపీ బట్రాజ సహకార సొసైటీ, ఏపీ మేదర సహకార సొసైటీ, ఏపీ కుమ్మరి-శాలివాహన సహకార సొసైటీ, మెదక్‌లోని టెక్స్‌టైల్స్ పార్కు, ఏపీఐఐసీ, నిజాం షుగర్స్, వైజాగ్ అపరెల్ పార్కు తదితర సంస్థలు.
విభజన పూర్తి కాని సంస్థలు
ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఏపీ ఫుడ్స్, ఏపీ గిరిజన సహకార సంస్థ, ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ సహకార ఫెడరేషన్, ఏపీ డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్, ఏపీడీసీ, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ పౌరసరఫరాల సంస్థ, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ, ఏపీ వికలాంగుల సహకార సంస్థ, ఏపీ జలవనరుల అభివృద్ధి సంస్థ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ విద్యుత్ ఆర్థిక సంస్థ, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ గృహ నిర్మాణ మండలి, ఏపీ రాజీవ్ స్వగృహ డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర చేనేత జౌళి సంస్థ, మైనారిటీ ఆర్థిక సంస్థ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థ.