devide
-
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
జనవరి 1లోగా నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు వీలుగా అన్ని వసతులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఇక ఉమ్మడి హైకోర్టు విభజనకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 1, 2019లోగా ఈ నోటిఫికేషన్ వెలువడుతుందని తాము ఆశిస్తున్నామని, తద్వారా రెండు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు వేర్వేరుగా విధులు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు నూతన భవనంలో త్వరగా తమ విధులు నిర్వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలంటూ 2015లో ధన్‌గోపాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ డిసెంబర్ 15లోగా హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతుందని. న్యాయమూర్తులకోసం తాత్కాలికంగా విల్లాలను అద్దెకు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ ఆ మేరకు అఫిడవిట్ సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రీ కూడా ఒక అఫిడవిట్ సమర్పించింది. ప్రతిపాదిత తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణంపై తనిఖీకోసం ఏర్పాటు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని, అక్కడికి వెళ్లేందుకు న్యాయమూర్తులు సిద్ధంగా లేరన్న అభిప్రాయం సరికాదని ఈ అఫిడవిట్లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు పేర్కొంది. ‘‘డిసెంబర్ 15, 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులుగా వెళ్లనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు ఈ భవనంలోని వసతులపై సంతృప్తి చెందారు. అమరావతిలో ‘జస్టిస్ సిటీ’పేరుతో భారీ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉంది. హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. న్యాయమూర్తులు, సబార్డినేట్ జ్యుడీషియల్ అధికారులకు వసతి కల్పించేందుకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల జస్టిస్ సిటీ నిర్మాణం పూర్తయ్యేంతవరకు తాత్కాలిక భవనంలో హైకోర్టు విధులు నిర్వర్తించవచ్చు. అవసరమైన అన్ని వసతులు సమకూరినందున ఇక హైకోర్టును విభజించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. ఈ నోటిఫికేషన్ జనవరి 1, 2019లోగా వెలువడుతుందని ఆశిస్తున్నాం. తద్వారా రెండు హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని, ఏపీ హైకోర్టు కూడా నూతన భవనంలో వీలైనంత త్వరగా కార్యకలాపాలు నిర్వర్తిస్తుంద ని ఆశిస్తున్నాం’’అని ధర్మాసనం పేర్కొంది. కోమటిరెడ్డి, సంపత్ కేసు తీర్పుపై స్టే పొడిగింపు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌లను బహిష్కరించడం చెల్లదని సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను మరో మూడు వారాలు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ/న్యాయ శాఖల కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే గడువు ముగిసిందని, తిరిగి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కోరారు. దీంతో ఉత్తర్వుల్ని మరో మూడు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
విభజనపై ఉత్కంఠ
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల విభజన ప్రక్రియపై పోలీసు సిబ్బందిలో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 21 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఎస్పీ ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. ఒకే బ్యాచ్‌లోని వారిని రోస్టర్‌లో కేటగిరీల వారీగా ఎలాంటి నష్టం లేకుండా మ్యూచ్వల్స్ చేసే అవకాశం ఉందని ఈనెల 12న ఎస్పీ ప్రకటించారు. సమస్యలు ఉన్నవారు, కోర్టును ఆశ్రయించిన వారు అభ్యంతరాలను తెలపాలని కోరుతూ ఐదు రకాల ఆప్షన్లను ఇస్తూ శుక్రవారం రూరల్ ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది విభజన విభాగాన్ని ప్రారంభించడంతో పాటు ఐదు బాక్సుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. కొత్తగా మ్యూచ్‌వల్ ట్రాన్స్ఫర్ పెట్టుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. వారి వినతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు. సిబ్బందిలో తర్జనభర్జన పూర్తి వివరాలను ఎస్పీ అన్ని పోలీస్ స్టేషన్ల అధికారుల ద్వారా అందజేయడంతో పాటు శుక్రవారం ఉదయం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యంతరాలు, ఆప్షన్లు, మ్యూచ్వల్స్ కోరుకునే వారు తాను చెప్పిన విధానంలో సీనియార్టీ కోల్పోవడానికి సిద్ధపడితే అభ్యంతరం ఉండదని వివరించారు. దీంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. కొందరైతే ఎలా జరిగినా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఏళ్ల తరబడి గుంటూరులో ఉంటూ సొంత ఇళ్లు ఉన్నవారు విభజనలో రూరల్‌కు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. తోటి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ అభ్యంతరాలు తెలియజేస్తే ఎలా చేయాలి? అనే విషయాల గురించి సీనియర్ల సలహాలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగుల సూచనలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నామమాత్రంగానే ఫిర్యాదులు మొదటి రోజున సిబ్బంది ఎస్పీ కార్యాలయానికి నామమాత్రంగానే వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాక్స్‌లో అభ్యంతరాలు, వినతులు, ఆప్షన్లు, మ్యూచ్వల్స్కు సంబంధించినవి వేసే ముందుగా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి రశీదు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటిరోజున 10లోపు ఫిర్యాదులు మాత్రమే అందాయి. మరో రెండు రోజుల సమయం ఉన్నందున వీటి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
పోలీస్ సిబ్బంది విభజన షురూ
గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. పూర్తి చేయడానికి ఇప్పటికే గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడు పలుమార్లు రేంజి డీఐజీ కేవీవీ గోపాలరావుతో చర్చించారు. ఆయన సలహాల మేరకు జాబితా రూపొందిస్తున్నారు. ఎలాగైనా సిబ్బంది విభజనను పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో కొనసాగుతున్న విభజన ప్రక్రియ వేగవంతం అయింది. గతంలో డీజీపీ వద్ద ఆమోదం పొందిన జాబితా ప్రకారమే సిబ్బంది విభజన చేయాలని డీఐజీ, ఎస్పీలు నిర్ణయించారు. మరో రెండు నెలల్లో పూర్తి చేసి మార్చి చివరి నాటికి విభజన పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఏడేళ్లుగా పెండింగ్.... అర్బన్, రూరల్ జిల్లా పోలీస్‌గా 2010లో విభజన జరిగింది. అప్పటి నుంచి పలుమార్లు సిబ్బంది విభజన చేపట్టాలని పలువురు ఎస్పీలు వారిదైనశైలిలో ప్రయత్నించారు. అయితే జాబితాలో పలు పొరపాట్లు వుండటం, సినీయార్టీ ప్రాధాన్యంలో వ్యత్యాసాలు రావడంతో కొందరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలచింది. అప్పట్లో గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది విభజనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొందరైతే ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని ఎస్పీలు సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటి వరకూ ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రస్తుత అర్బన్, రూరల్ ఎస్పీలు అతి త్వరలో సిబ్బంది విభజన చేపట్టి ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పెనుభారంగా బందోబస్తు విధులు... గుంటూరు అర్బన్ జిల్లాలో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బందోబస్తు నిర్వహణ సిబ్బందికి పెను సవాలుగా మారింది. తరచూ జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం, సాధారణ విధులు నిర్వహించడం కారణంగా తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత తలనొప్పిగా మారింది. కొరత తీర్చాలంటే సిబ్బంది విభజన అనివార్యమని భావించి రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు డీఐజీతో చర్చించి విభజనకు విదివిధానాలు సిద్ధం చేశారు. 2010 నుంచి పలు దఫాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్న అర్బన్ ఎస్పీ ఇదే విషయంపై ఇటీవల రూరల్ఎస్పీతో సమావేశమయ్యారు. డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారం విభజన చేయాలని, దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రూరల్ ఎస్పీకి సూచించినట్లు తెలిసింది. ఈనెలలో విధుల్లో చేరిన డీజీపీ మాలకొండయ్య కూడా విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈసారైనా అమలు జరిగితే సిబ్బందిలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి నచ్చినచోట ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సిబ్బందిలో ఆందోళన... విభజన ప్రక్రియ విషయం తెరమీదకి వచ్చిన ప్రతిసారీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వారి పిల్లల చదువుల కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే విభజన ప్రక్రియ మార్చి నాటికి పూర్తయితే ఎలాంటి సమస్యలు వుండవంటున్నారు. ఒకవేళ సమస్యలు తలెత్తి నిలిచిపోయి జాన్ తర్వాత జరిగితే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. మార్చి చివరి నాటికి విభజన పూర్తి పరిపాలనా సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాను. తప్పులు, సమస్యలు తలెత్తకుండా వుండేలా జాబితాను రూపొందించాలని ఆదేశించాను. గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తున్నాం. విమర్శలకు తావులేకుండా మార్చి చివరి నాటికి విభజన ప్రక్రియను పూర్తి చేస్తాం. సీహెచ్ వెంకటప్పల నాయుడు, రూరల్ ఎస్పీ -
పోలీస్ శాఖలో మరో ఫిర్కా
♦ గూడూరు సబ్ డివిజన్ విభజనకు ప్రతిపాదనలు ♦ నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం ♦ ఎర్ర చందనం, ఇసుక. సిలికా అక్రమ రవాణా నియంత్రణే కీలకం ♦ డీజీపీ నిర్ణయమే తరువాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో మరో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ సబ్ డివిజన్‌గా ఉన్న గూడూరును రెండుగా విభజించాలని నిర్ణయించారు. ఇం దుకు రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రతిపాదనలు పంపించారు. గూ డూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ తోపాటు నేరాల నియంత్రణ కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలు డీజీపీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 5పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 22 సర్కిల్స్, 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్స్, 20 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లాలోని మొత్తం స్టేషన్లలో 30 శాతం ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పోలీస్ సబ్ డివిజన్ల పరిధితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెద్దది. రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ డివిజన్‌గా, భారీగా అక్రమ ఆదాయం పొందే కేంద్రంగా పేరొందింది. ఆదాయం అంతా ఇంతా కాదు జిల్లాలో సాగే అక్రమ వ్యాపారంలో అత్యధిక శాతం గూడూరు సబ్ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. ఎర్ర చందనం మొదలుకొని సిలికా, ఇసుక అక్రమ రవాణా అంతా ఇక్కడే నడుస్తుంది. అత్యధిక మామూళ్లు వచ్చే సబ్ డివిజన్ కావటంతో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ పనిచేస్తూ గత నెలలో వీఆర్‌కు బదిలీ అయిన డీఎస్పీ బి.శ్రీనివాస్‌పై పెద్దెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ నెలకు రూ.50 లక్షలపైనే మామూళ్లు, ఇతర ఆదాయం ఉంటుందని అంచనా. తమిళనాడు నుంచి అక్రమంగా వచ్చే బియ్యం, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అక్రమ రవాణా దారుల నుంచి భారీగా మామూళ్లు అందుతాయి. ఇసుక రవాణా ఆదాయం రూ.లక్షల్లో ఉంటుంది. వెంకటగిరి స్టేషన్ పరిధిలో ఎర్ర చందనం కేసులు ఎక్కువ. గతంలో కొందరు పోలీస్లే ఎర్ర చందనం అక్రమ రవాణా వాహనాలకు పైలట్‌గా వ్యవహరించేవారు. దీనికి గాను రూ.లక్షల్లో ముడుపులు అందేవి. సిలికా ఇసుక అక్రమ రవాణా కూడా ఇక్కడే అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 250కి పైగా మద్యం షాపులు, 10 వరకు బార్లు ఉన్నాయి. వీటి నుంచి రూ.12 లక్షల వరకు అందుతాయి. ఇదిలావుంటే.. జాతీయ రహదారి పరిధి అత్యధికంగా దీని పరిధిలోనే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు డిమాండ్ ఉండేది. గత నెలలోనే ప్రతిపాదనలు గూడూరు సబ్ డివిజన్‌ను గూడూరు, నాయుడుపేట సబ్ డివిజన్లుగా విభజించాలని ప్రతిపాదించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట సర్కిల్స్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లతోపాటు ఓజిలి స్టేషన్‌ను కలిపి 7 స్టేషన్లు, రెండు సర్కిల్స్‌తో నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనూ ప్రతిపాదనలు వెళ్లగా.. పురోగతి లేకపోవటంతో తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి పరిస్థితిని డీజీపీకి వివరించిన ఉన్నతాధికారులు సబ్ డివిజన్‌ను విభజించాలని కోరారు. సాంకేతికపరమైన లాంఛనాలను పూర్తి చేసుకుని నెల రోజుల్లో కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
59 సంస్థల విభజన పూర్తి
రెండు రాష్ట్రాలకు ఆస్తులు, అప్పుల పంపిణీఆడిట్ కారణంగా మరో 31 సంస్థల విభజనలో జాప్యం ఆగస్టు 15 కల్లా ఆడిట్ పూర్తి చేయమని ఆదేశం షీలాభిడే కమిటీ స్పష్టీకరణ రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్స్టిట్యూషన్ల విభజనకు, ఆస్తులు, అప్పులు పంపిణీపై ఏర్పాటైన షీలాభిడే కమిటీ ఇప్పటి వరకు 59 సంస్థల విభజనను పూర్తి చేసింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. సంబంధిత వివరాలతో షీలాభిడే కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరో 31 సంస్థల విభజన జాప్యానికి ప్రధాన కారణం ఆడిట్ పూర్తి చేయకపోవడమేనని కమిటీ పేర్కొంది. ఆడిట్‌ను ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తి చేయాల్సిందిగా ఆ సంస్థల ఎండీలకు స్పష్టం చేసినట్లు కమిటీ తెలిపింది. ఆయా సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. - సాక్షి, హైదరాబాద్ విభజన పూర్తైన సంస్థలు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ, ఏపీ ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్, ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ఏపీ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ స్టేట్ ఆస్తి పన్ను మండలి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ, ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, ఏపీ సహకార చక్కెర ఫ్యాక్టరీల ఫెడరేషన్, ఏపీ మీట్ అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ టెక్స్టైల్స్ కార్పొరేషన్, ఏపీ మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్, రాష్ర్ట స్పోర్ట్స్ అధారిటీ, ఏపీ రోడ్డు అభివృద్ది సంస్థ, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ గీత కార్మికుల సహకార సొసైటీ, ఏపీ పట్టణ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, ఏపీ వాల్మీకి, బోయ సహకార సొసైటీ, ఏపీ విశ్వబ్రాహ్మణ సహకార సొసైటీ, ఏపీ కృష్ణ బలిజ సహకార సొసైటీ, ఏపీ బట్రాజ సహకార సొసైటీ, ఏపీ మేదర సహకార సొసైటీ, ఏపీ కుమ్మరి-శాలివాహన సహకార సొసైటీ, మెదక్‌లోని టెక్స్టైల్స్ పార్కు, ఏపీఐఐసీ, నిజాం షుగర్స్, వైజాగ్ అపరెల్ పార్కు తదితర సంస్థలు. విభజన పూర్తి కాని సంస్థలు ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఏపీ ఫుడ్స్, ఏపీ గిరిజన సహకార సంస్థ, ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ సహకార ఫెడరేషన్, ఏపీ డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్, ఏపీడీసీ, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ పౌరసరఫరాల సంస్థ, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ, ఏపీ వికలాంగుల సహకార సంస్థ, ఏపీ జలవనరుల అభివృద్ధి సంస్థ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ విద్యుత్ ఆర్థిక సంస్థ, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ గృహ నిర్మాణ మండలి, ఏపీ రాజీవ్ స్వగృహ డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర చేనేత జౌళి సంస్థ, మైనారిటీ ఆర్థిక సంస్థ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థ. -
మే14లోగా ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విభజన మే14 లోపల పూర్తయ్యే అవకాశముందని ఆ సంస్థ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. మంగళవాళం విశాఖనగర శివారు మధురవాడ డిపో, 18 అధునాతన బస్సులు ప్రారంభం కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన 95 శాతం పూర్తి అయిందని, ఆస్తులు విభజనకి ప్రభుత్వం షీలా బిడే కమిషన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ రిపోర్టు తర్వాతే ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవుతుందని చెప్పారు. మే 14 తర్వాత రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అన్నారు. కార్మికుల ఫిట్ మెంట్ పై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.