మే14లోగా ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ | rtc bifurcation will compleate on before may 14 | Sakshi
Sakshi News home page

మే14లోగా ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ

Apr 22 2015 3:09 AM | Updated on Sep 3 2017 12:38 AM

మే14లోగా ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ

మే14లోగా ఆర్టీసీ విభజన పూర్తి: ఎండీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విభజన మే14 లోపల పూర్తయ్యే అవకాశముందని ఆ సంస్థ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు.

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విభజన మే14 లోపల పూర్తయ్యే అవకాశముందని ఆ సంస్థ ఎండీ ఎన్. సాంబశివరావు తెలిపారు. మంగళవాళం విశాఖనగర శివారు మధురవాడ డిపో, 18 అధునాతన బస్సులు ప్రారంభం కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన 95 శాతం పూర్తి అయిందని,  ఆస్తులు విభజనకి ప్రభుత్వం షీలా బిడే కమిషన్‌ని ఏర్పాటు చేసిందన్నారు.  ఆ కమిటీ రిపోర్టు తర్వాతే ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవుతుందని చెప్పారు.   మే 14 తర్వాత రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అన్నారు. కార్మికుల ఫిట్ మెంట్ పై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement