కొండపై తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శ్రీవారి దర్శనానికి బుధవారం 7 గంటల సమయం పడుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 36,338 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా 13 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 7 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు.
అలాగే, 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న కాలినడక భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని చెప్పారు. కాగా, బుధవారం శ్రీవారి హుండీ లెక్కింపుల్లో (మంగళవారం భక్తులు సమర్పించినవి) ఆదాయం రూ.2.38 కోట్లు లభించింది.