కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భక్తులు పుణ్యక్షేత్రాలకు బారులు తీరారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భక్తులు పుణ్యక్షేత్రాలకు బారులు తీరారు. ఆదివారం ఉదయం నుంచి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు.
కృష్ణానదిలో కార్తీక దీపోత్సవంలో మహిళలు పాల్గొన్నారు. అమరావతిలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. సూర్యలంకలో సముద్ర స్నానం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీశైలంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలో భక్తులు పోటెత్తారు. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.