గుంటూరు ఈస్ట్: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు హైవేలపై జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. గుంటూరులో నిర్మిస్తున్న పాతగుంటూరు, నగరంపాలెం మోడల్ పోలీస్టేషన్‌లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిర్ణీత మార్గంలో జియో ఫెన్సింగ్ సిగ్నల్స్ ఏర్పాటుతో ఎదురుగా వచ్చే వాహనాల వివరాలను ముందుగానే తెలుసుకొని ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. దీని ఉచిత యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
ఎన్‌హెచ్ 16పై విజయవాడ, విశాఖ మధ్య ప్రయోగాత్మకంగా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోడల్ పోలీస్‌స్టేషన్‌లలో లాకప్‌లలో ఉండే నిందితులకు సౌకర్యవంతమైన బెడ్‌లు , ఏసీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు. మన రాష్ట్రంలో గతంలో వేలల్లో ఉన్న మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం 109కి చేరిందన్నారు.
జియో ఫెన్సింగ్‌తో కళ్లెం: డీజీపీ
Published Thu, Jan 5 2017 1:02 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement