వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
అనంతపురంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవిభజన వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం కేతిరెడ్డి వహిస్తున్నారు.
రాష్ట్ర విభజనపై ఆగ్రహం ఉన్న కేతిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. ఆయనకు విజయమ్మ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్ర విభజనపై నిరసనగా కాంగ్రెస్ పార్టీకి కాటసాని రాంరెడ్డి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.