పల్లెలపై అతిసార పడగ | Diarrhealspread on villages | Sakshi
Sakshi News home page

పల్లెలపై అతిసార పడగ

Published Sat, Nov 23 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

Diarrhealspread on villages

బెలగాం, న్యూస్‌లైన్ : పార్వతీపురం డివిజన్‌లో అతిసార ప్రబలింది. ఇక్కడ ఏరియూ ఆస్పత్రిలో అతిసార రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం అతిసార వార్డులో సుమారు 15 మంది రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన గొంగాడ అప్పమ్మ, మరిపివలస గ్రామానికి చెందిన కలమటి విల్లు, జోగింపేట గురుకులానికి చెందిన రాకోటి శ్రీను, పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలసకు చెందిన పాలక బన్ని, జియ్యమ్మవలసకు చెందిన పెద్దింటి అప్పలనరసమ్మ, గరుగుబిల్లి మండలం కారివలస గ్రామానికి చెందిన సాలగిరి సింహాడుతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.

వీరికి వైద్యులు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు వల్లే అతిసార ప్రబలుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. తద్వారా కొంత వరకు అతిసారను అదుపులోకి తేవచ్చని చెప్పారు.  
 పేరిపిలో మళ్లీ జ్వరాలు
 పేరిపి (చీపురుపల్లి రూరల్) : పేరిపి గ్రామంలో జ్వరాలు మళ్లీ విజృంభించారుు. గ్రామంలో మీసాల రమాదేవి, యలకల అప్పమ్మ, సిరిపురపు దుర్గారావు, యలకల పార్వతి, మరుగంటి వరలక్ష్మితో పాటు పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది కర్లాం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించారు. కొందరికీ జ్వరాలు ఉన్నట్టు గుర్తించామని ఎంపీహెచ్‌ఓ ఎన్.అప్పలనాయుడు తెలిపారు.

అవసరమైన మేరకు మందులను పంపిణీ చేశామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్ కార్యదర్శిని గ్రామానికి పంపించి నీటి వనరులను క్లోరినేషన్ చేరుుంచే బాధ్యతలు అప్పగించారు. రెండు వారాల కిందట ఇదే గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో అప్పట్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు శిబిరాన్ని కొనసాగించారు. మళ్లీ జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement