diarrheal
-
అతిసార బాధితులకు పవన్ పరామర్శ
-
'స్వచ్ఛత' వైపు బండపోతుగళ్
అతిసార నుంచి బయటపడిన గ్రామం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు కౌడిపల్లి : అతిసారతో అతలాకుతలమైన గ్రామం స్వచ్ఛత వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. పక్షం రోజులక్రితం గ్రామంలో అతిసార ప్రారంభంకాగా వందల సంఖ్యలో గ్రామ ప్రజలు రోగాల బారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం గ్రామం కోలుకుంది. ఇదే స్ఫూర్తితో వందశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు గ్రామస్తులు చర్యలు చేపట్టారు. మండలంలోని బండపోతుగళ్‌లో గతనెల 25వ తేదీ నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమై గ్రామస్తులందరికి వ్యాపించింది. రక్షితం మంచినీటి పథకం నీరు కలుషితం కావడంతో గ్రామంలో అతిసార ప్రబలింది. దీంతో గతనెల 27వ తేదీన స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు గ్రామస్తులతో గ్రామంలో కలియ తిరిగి పరిస్థితులను సమీక్షించారు. స్వచ్ఛ గ్రామం వైపు.. బండపోతుగళ్ గ్రామాన్ని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సందర్శంచి సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం సహకరించాలని వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో 218 కుటుంబాలు, జనాభా 1160 జనాభా ఉన్నారు. గ్రామానికి రెండు రక్షిత మంచినీటి ట్యాంకులు, ఒక మినీ ట్యాంక్ ద్వారా నీటి సరఫర జరుగుతుంది. ఇందులో 187 కుటుంబాలకు ఇంటింటికి నల్లకనెక్షన్లు ఉన్నాయి. గ్రామంలో 51 కుటుంబాలకు మరుగుదొడ్లు ఉండగా 136 కుటుంబాకు మరుగుదొడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 108 మందికి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు సొంత స్థలం ఉండగా, 28 కుటుంబాలకు స్థలంలేదు. రక్షిత మంచినీరు కలుషితం కావడంతోనే అతిసార వ్యాపించినట్లు గుర్తించిన అధికారులు గ్రామస్తులకు పది రోజులపాటు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు రోజూ 300 బాటిళ్లలో తాగునీటిని అందించారు. అనంతరం 56 నల్లాగుంతలు పూడ్చివేసి గుంతలలో ఉన్న నల్లా కనెక్షన్లను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో పైకి అమర్చారు. మురికి కాలువలు శుభ్రం చేయడంతోపాటు రోడ్డుపై ఉన్నటువంటి చెత్త, మురికిని శుభ్రంచేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రక్షిత మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయడంతోపాటు లీకేజీలు సరిచేశారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఇంటంటింకి మరుగుదొడ్లు కట్టించుకునేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం: షఫి, బండపోతుగళ్ సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. వీధులన్నీ శుభ్రం చేయడంతోపాటు నల్లా గుంతలను పూడ్చివేశారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు: విఠల్, సర్పంచ్ బండపోతుగళ్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆదేశించారు. అలా చేస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో ఇప్పటికే కొందరు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామస్తులకు అవగాహన వెంకటేశ్ , పంచాయితీ కార్యదర్శి, బండపోతుగళ్ సంపూర్ణ పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు గాను చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ఎంతమందకి అవసరం ఉందో ఇప్పటికే గుర్తించాం. దీంతో త్వరలో గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారనుంది. -
బండపోతుగళ్‌లో అదుపులో అతిసార
కౌడిపల్లి: మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. అధికారులు సకాలంలో స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో అతిసార తగ్గింది. మంగళవారం నాటి వైద్య శిబిరంలో కేవలం ముగ్గురు మాత్రమే ఓపీ చూయించుకున్నారు. ఎవరికి వాంతులు విరేచనాలు లేవని డాక్టర్ దివ్యజ్ఞ తెలిపారు. ఈఓపీఆర్డీ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, నరేష్, విజయ్‌పాల్‌రెడ్డి తదితరులు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రక్షిత మంచినీటి పథకం వద్ద కట్ వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలు లేకుండా చేశారు. -
తస్మాత్ జాగ్రత్త..!
♦ ఏజెన్సీలో అధ్వాన్నంగా పారిశుద్ధ్యం ♦ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ♦డయేరియాతో వృద్ధురాలు మృతి ఒకవైపు వర్షాలు, వరదలు. మరోవైపు చెత్తకుప్పలు, మురుగు నీరు. కనిపించని పారిశుద్ధ్య చర్యలు. పరిస్థితి ఇలా ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయా? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక మండలాల ప్రజలకు కంటిపై కునుకు కరువైంది. ఈ వర్షాలతో వ్యాధులు ప్రబలుతాయేమోనని వారు భయపడుతున్నారు. వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో డయేరియాతో ఓ వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది. భద్రాచలం : ప్రస్తుత తరుణంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పంచాయతీ పాలకులు, అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించడంలో, తాగునీటి పథకాల్లో క్లోరినేషన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి వరదలతో కరకట్ట స్లూయిస్ల లీకేజీ కారణంగా భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్ కొత్త కాలనీలోని ఇళ్లు రెండు రోజుల నుంచి నీట మునిగే ఉన్నాయి. పట్టణంలోని మురుగు నీరంతా కూడా ఇక్కడికే వస్తోంది. దీంతో కొత్త కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వర్షాలతో అవి తడిచి దుర్గంధం వస్తోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొత్త కాలనీకి వెళ్లే దారి చెత్త డంపింగ్ యార్డులా మారింది. వరద ముంపుతో బాధితుల పునరావాస శిబిరమైన సమీపంలోని పాఠశాల వద్ద కూడా పారిశుద్ధ్యం లోపించింది. భద్రాచలంలోని పంచాయతీ అధికారులు ప్రధాన రోడ్లపై తప్ప కాలనీలను పట్టించుకోవడం లేదని,పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ఆయా కాలనీ వాసులు మండిపడుతున్నారు. కలుషిత నీటితో అంటు వ్యాధులు వాగులు పొంగి ప్రవహిస్తుండటం, ఓవర్ హెడ్ ట్యాంకులకు వెళ్లే పైపుల లీకేజీల కారణంగా తాగు నీరు కలుషితమయ్యే ప్రమాదముంది. ఏజెన్సీలోని అటవీ ప్రాంత గ్రామాల్లోని గిరిజనులు ఇప్పటికీ వాగుల నీటినే తాగుతున్నారు. ఈ నీరు ప్రస్తుతం కలుషితమైనందున డయేరియా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల ఇదే విషయం చెప్పారు. ‘‘చెత్తకుప్పలను తొలగించకపోతే దోమలు పెరిగి, మలేరియా జ్వరాలు వస్తాయి. మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాలకన్నా కూడా మలేరియా, చికున్‌గున్యా, డెంగీ తదితర వ్యాధులు భద్రాచలం పట్టణంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అందుకే ఇక్కడి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతనైనా పారిశుద్ధ్య నివారణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..! సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ రాజీవ్ భద్రాచలం : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, తగిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ కోరారు. ఆయన మంగళవారం తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులైన మలేరియా, డయేరియా, డెంగీ వంటివి ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్పీహెచ్ఓలు క్లస్టర్ పరిధిలో, వైద్యాధికారులు మండల పరిధిలో రోజూ తరచుగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. ఐకేపీ, పంచాయతీ రాజ్, మంచినీటి సరఫరా విభాగాల సిబ్బందితో ప్రతి 15 రోజులకోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్ల విధులను హెచ్‌ఈఓలు, సీహెచ్‌ఓలు, హెల్త్ సూపర్వైజర్లు పరిశీలించాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు రెండు రోజులకోసారి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులతో ఎవరైనా మృతిచెందితే సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంఓ డాక్టర్ రాంబాబు, ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల, ఏఎమ్ఓలు బన్సీలాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలపై అతిసార పడగ
బెలగాం, న్యూస్‌లైన్ : పార్వతీపురం డివిజన్లో అతిసార ప్రబలింది. ఇక్కడ ఏరియూ ఆస్పత్రిలో అతిసార రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం అతిసార వార్డులో సుమారు 15 మంది రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన గొంగాడ అప్పమ్మ, మరిపివలస గ్రామానికి చెందిన కలమటి విల్లు, జోగింపేట గురుకులానికి చెందిన రాకోటి శ్రీను, పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలసకు చెందిన పాలక బన్ని, జియ్యమ్మవలసకు చెందిన పెద్దింటి అప్పలనరసమ్మ, గరుగుబిల్లి మండలం కారివలస గ్రామానికి చెందిన సాలగిరి సింహాడుతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. వీరికి వైద్యులు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు వల్లే అతిసార ప్రబలుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. తద్వారా కొంత వరకు అతిసారను అదుపులోకి తేవచ్చని చెప్పారు. పేరిపిలో మళ్లీ జ్వరాలు పేరిపి (చీపురుపల్లి రూరల్) : పేరిపి గ్రామంలో జ్వరాలు మళ్లీ విజృంభించారుు. గ్రామంలో మీసాల రమాదేవి, యలకల అప్పమ్మ, సిరిపురపు దుర్గారావు, యలకల పార్వతి, మరుగంటి వరలక్ష్మితో పాటు పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది కర్లాం పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించారు. కొందరికీ జ్వరాలు ఉన్నట్టు గుర్తించామని ఎంపీహెచ్‌ఓ ఎన్.అప్పలనాయుడు తెలిపారు. అవసరమైన మేరకు మందులను పంపిణీ చేశామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్ కార్యదర్శిని గ్రామానికి పంపించి నీటి వనరులను క్లోరినేషన్ చేరుుంచే బాధ్యతలు అప్పగించారు. రెండు వారాల కిందట ఇదే గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో అప్పట్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు శిబిరాన్ని కొనసాగించారు. మళ్లీ జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
పడగ విప్పిన అతిసార
=నెల రోజుల్లో ఒకే ఇంట ముగ్గురు మృతి =పి.కొట్నాబిల్లిలో విషాదం =శంకరం పంచాయతీలో మరొకరు రావికమతం/మాడుగుల, న్యూస్‌లైన్: ఇటీవల భారీ వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితుల తో వ్యాధులు బసలు కొడుతున్నాయి. ముఖ్యంగా పల్లె ల్లో పారిశుద్ధ్యం కొరవడి అతిసార పడగ విప్పుతోంది. రావికమతం, మాడుగుల మండలాల్లో నలుగురు చనిపోయా రు. రావికమతం మండలంలోని టి.అర్జాపురం శివారు పి.కొట్నాబిల్లి గ్రామంలో అతిసార మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని కబళించింది. మృతు ల్లో ఇరువురు అన్నదమ్ములు కాగా మరొకరు వారికి మామ. నెల రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. దీంతో ముగ్గురు మగదిక్కు కోల్పోయిన తామెలా బతకాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి ఇవే లక్షణాలతో బాధపడుతున్న నంద్యాల రాజబాబు (45) బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలున్నారు. వీరు తల్లిని పట్టుకుని రోదించడం పలువురిని కలచివేసింది. వారం రోజుల క్రితం అతిసారతో రాజబాబు తమ్ముడు అప్పారావు మృతి చెందాడు. నెల రోజుల కిందట మృతుల మేనమామ డోలా అర్జున తీవ్ర వాంతులు, విరోచనాలతో కాళ్లు తన్నుకుపోయి మృతిచెందాడని తెలిపారు. అలాగే వీరి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న శీదరి గొంతులమ్మ అతిసారతో బాధపడుతోంది. ఆమెను చికిత్స నిమిత్తం రావికమతం పీహెచ్‌సీకి, అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా తమ గ్రామానికి వైద్య సిబ్బందెవ్వరూ రాలేదని వారు వాపోయారు. పంచాయితీ ఉప సర్పంచ్ సన్యాసినాయుడు, సిబ్బంది గురువారం గ్రామానికి వచ్చి బ్లీచింగ్ చల్లి క్లోరినేషన్ చేపట్టారు. మాడుగుల మండలంలో శంకరంలోనూ ఇదే దుస్థితి. గ్రామానికి చెందిన గొర్లె అప్పలస్వామి (65) అతిసారతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదే గ్రామంలో పదిమంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అతిసార ప్రబలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని క్లస్టర్ సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి పి.శ్రావణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా,అప్పలస్వామి మోతాదుకు మించి మద్యం సేవించడంతో మృతిచెందాడని తెలిపారు. గ్రామంలో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. పత్తాలేని వైద్యాధికారులు పి.కొట్నాబిల్లి గిరిజన గ్రామం. ఆపై కొండ పక్కన ఉండటంతో ప్రస్తుత వర్షాలకు గ్రామమంతా నీటితో నిండి ఉంది. ఏ ఇంటి ముందు చూసినా బురద, దుర్గంధం తాండవిస్తోంది. గ్రామస్తులు బోరు, మంచినీటి పథకం నీటిని మరిగించి తాగుతున్నారు. అయినా అతిసార ఎలా ప్రబలిందో అర్థం కావడం లేదని గ్రామస్తులు నంద్యాల రాము, డోలా కళ్యాణం పేర్కొన్నారు. అధికారులు తక్షణమే గ్రామానికి వచ్చి సరైన వైద్యం అందించాలనికోరుతున్నారు.