'స్వచ్ఛత' వైపు బండపోతుగళ్‌ | bandapothugal.. survived from diarrheal | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత వైపు బండపోతుగళ్‌

Published Sun, Aug 7 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

బండపోతుగళ్‌ గ్రామం

బండపోతుగళ్‌ గ్రామం

  • అతిసార నుంచి బయటపడిన గ్రామం
  • వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం
  • సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు
  • కౌడిపల్లి : అతిసారతో అతలాకుతలమైన గ్రామం స్వచ్ఛత వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. పక్షం రోజులక్రితం గ్రామంలో అతిసార  ప్రారంభంకాగా వందల సంఖ్యలో గ్రామ ప్రజలు రోగాల బారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందారు. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం గ్రామం కోలుకుంది. ఇదే స్ఫూర్తితో వందశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు గ్రామస్తులు చర్యలు చేపట్టారు.  

    మండలంలోని బండపోతుగళ్‌లో గతనెల 25వ తేదీ నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు ప్రారంభమై గ్రామస్తులందరికి వ్యాపించింది. రక్షితం మంచినీటి పథకం నీరు కలుషితం కావడంతో గ్రామంలో అతిసార ప్రబలింది. దీంతో గతనెల 27వ తేదీన స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు గ్రామస్తులతో గ్రామంలో కలియ తిరిగి పరిస్థితులను సమీక్షించారు.

    స్వచ్ఛ గ్రామం వైపు..
    బండపోతుగళ్‌ గ్రామాన్ని కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌  సందర్శంచి సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం సహకరించాలని  వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో 218 కుటుంబాలు, జనాభా 1160 జనాభా ఉన్నారు. గ్రామానికి రెండు రక్షిత మంచినీటి ట్యాంకులు, ఒక మినీ ట్యాంక్‌ ద్వారా నీటి సరఫర జరుగుతుంది.

    ఇందులో 187 కుటుంబాలకు ఇంటింటికి నల్లకనెక‌్షన్లు ఉన్నాయి. గ్రామంలో 51 కుటుంబాలకు మరుగుదొడ్లు ఉండగా 136 కుటుంబాకు మరుగుదొడ్లు అవసరమని అధికారులు గుర్తించారు.  ఇందులో 108 మందికి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు సొంత స్థలం ఉండగా, 28 కుటుంబాలకు స్థలంలేదు.

    రక్షిత మంచినీరు కలుషితం కావడంతోనే అతిసార వ్యాపించినట్లు గుర్తించిన అధికారులు గ్రామస్తులకు పది రోజులపాటు ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు రోజూ 300 బాటిళ్లలో తాగునీటిని అందించారు. అనంతరం 56 నల్లాగుంతలు పూడ్చివేసి గుంతలలో ఉన్న నల్లా కనెక‌్షన్లను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో పైకి అమర్చారు.

    మురికి కాలువలు శుభ్రం చేయడంతోపాటు రోడ్డుపై ఉన్నటువంటి చెత్త, మురికిని శుభ్రంచేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రక్షిత మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయడంతోపాటు లీకేజీలు సరిచేశారు. కలెక్టర్‌ ఆదేశాలమేరకు ఇంటంటింకి మరుగుదొడ్లు కట్టించుకునేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు.

    సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం: షఫి, బండపోతుగళ్‌
    సంపూర్ణ పారిశుద్ధ్యంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో పారిశుద్ధ్య పనులు  ముమ్మరంగా నిర్వహించారు. వీధులన్నీ శుభ్రం చేయడంతోపాటు నల్లా గుంతలను పూడ్చివేశారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారు.

    వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు: విఠల్‌, సర్పంచ్‌ బండపోతుగళ్‌
    కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆదేశించారు. అలా చేస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు దీంతో ఇప్పటికే కొందరు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

    గ్రామస్తులకు అవగాహన  వెంకటేశ్‌ , పంచాయితీ కార్యదర్శి, బండపోతుగళ్‌
    సంపూర్ణ పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు గాను  చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ఎంతమందకి అవసరం ఉందో ఇప్పటికే గుర్తించాం. దీంతో త్వరలో గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement