belagam
-
పల్లెలపై అతిసార పడగ
బెలగాం, న్యూస్‌లైన్ : పార్వతీపురం డివిజన్లో అతిసార ప్రబలింది. ఇక్కడ ఏరియూ ఆస్పత్రిలో అతిసార రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం అతిసార వార్డులో సుమారు 15 మంది రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన గొంగాడ అప్పమ్మ, మరిపివలస గ్రామానికి చెందిన కలమటి విల్లు, జోగింపేట గురుకులానికి చెందిన రాకోటి శ్రీను, పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలసకు చెందిన పాలక బన్ని, జియ్యమ్మవలసకు చెందిన పెద్దింటి అప్పలనరసమ్మ, గరుగుబిల్లి మండలం కారివలస గ్రామానికి చెందిన సాలగిరి సింహాడుతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. వీరికి వైద్యులు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు వల్లే అతిసార ప్రబలుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. తద్వారా కొంత వరకు అతిసారను అదుపులోకి తేవచ్చని చెప్పారు. పేరిపిలో మళ్లీ జ్వరాలు పేరిపి (చీపురుపల్లి రూరల్) : పేరిపి గ్రామంలో జ్వరాలు మళ్లీ విజృంభించారుు. గ్రామంలో మీసాల రమాదేవి, యలకల అప్పమ్మ, సిరిపురపు దుర్గారావు, యలకల పార్వతి, మరుగంటి వరలక్ష్మితో పాటు పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది కర్లాం పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించారు. కొందరికీ జ్వరాలు ఉన్నట్టు గుర్తించామని ఎంపీహెచ్‌ఓ ఎన్.అప్పలనాయుడు తెలిపారు. అవసరమైన మేరకు మందులను పంపిణీ చేశామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్ కార్యదర్శిని గ్రామానికి పంపించి నీటి వనరులను క్లోరినేషన్ చేరుుంచే బాధ్యతలు అప్పగించారు. రెండు వారాల కిందట ఇదే గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో అప్పట్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు శిబిరాన్ని కొనసాగించారు. మళ్లీ జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
పార్వతీపురంలో జనవరి నుంచి త్రీజీ సేవలు
బెలగాం, న్యూస్‌లైన్: పార్వతీపురం పట్టణానికి 2014 జనవరిలో త్రీజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని బీఎస్ఎన్ఎల్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభా రామారావు చెప్పారు. పార్వతీపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో వినియోగదారులతో బుధవారం ఓపెన్‌హౌస్ సెషన్స్‌ను నిర్వహించారు. ఈ సదస్సులో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ పథకాలు, సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సులో పాల్గొన్న వినియోగదారులు పలు సమస్యలను, అభిప్రాయలు, సలహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పార్వతీపురం పట్టణంలో ల్యాండ్ లైన్ సక్రమంగా పనిచేయడం లేదని, ఇది వరలో ఇక్కడ ఉన్న సబ్‌డివిజనల్ ఇంజినీర్ కార్యాలయాన్ని బొబ్బిలికి తరలించారని, తిరిగి ఆ కార్యాలయాలన్ని పునరుద్ధరించాలని వినియోగదారులు కోరారు. హైదరాబాద్‌లో బ్రాండ్‌బాండ్ అన్‌లిమిటెడ్‌కు రూ.500 చెల్లిస్తున్నారని ఆ విధానాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలన్నారు. సెల్‌టవర్స్, ల్యాండ్ లైన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వినియోగదారులు వాపోగా సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని డీజీఎం చెప్పారు. రూ.1కోటి బకాయి సదస్సు అనంతరం డీజీఎం విలేకరులతో మాట్లాడుతూ. జిల్లాలోని బీఎస్ఎన్ఎల్కు రూ.1కోటి బకాయిలు రావలసి ఉందన్నారు. ఈ సొమ్ము రికవరీకీ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 191 సెల్‌టవర్స్ ఉన్నాయని అదనంగా ఈ ఏడాది 74సెల్‌టవర్స్ మంజూరయ్యాయని చెప్పారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన చినగుడబ, కొత్తవలస, కన్యకాపరవేశ్వరి ఆలయం, ఉల్లిభద్ర, శిఖబడి, మునుగడ, తాడికొండలలో సెల్‌టవర్స్ నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్కు నెలకు రూ.4కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. సమావేశంలో డీఈ వై.సాంబశివరావు, ఏఈ పి.సురేష్‌కుమార్, జేటీఓ రామశేఖర్, ఎస్డీఈ తాతప్రసాద్, టెలి కం అడ్వైజర్ మెంబర్ ఎం.సింహచలం, సిబ్బంది, వినియోగదారులు ఉన్నారు.