రహదారులు రక్తసిక్తం
Published Wed, Mar 19 2014 1:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM
కొమ్మూరు(కాకుమాను), న్యూస్‌లైన్ :జిల్లాలో వేర్వేరు చోట్ల మంగళవారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందా రు. మరో 12 మంది గాయాల పాలయ్యారు. మద్యం మత్తు, అతివేగం కారణాలని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇవీ... కాకుమాను మండలం కొమ్మూరు శివారులో మంగళవారం వివరాల ప్రకారం మండలంలోని కాకుమాను, కొమ్మూరు గ్రామాల మధ్య అతివేగం కారణంగా వ్యక్తి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కాకుమాను నుంచి పెదనందిపాడు వైపు వెళ్తున్న ఆటో, వీఆర్‌వీ టెక్స్‌టైల్ వైపు నుంచి ప్రధాన రహదారి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం కొమ్మూరు శివారులో ఢీకొన్నాయి.
ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న క్రాంతి(23) అక్కడిక్కడే మృతి చెందాడు. క్రాంతి అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్ తెలిపారు. మృతుడిని కృష్ణా జిల్లా కంకిపాడు వాసిగా గుర్తించినట్లు చెప్పారు. స్థానిక వీఆర్‌వీ టెక్ట్‌టైల్స్ ఉద్యోగి అని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని, వారికి గాయాలు కాలేదని చెప్పారు.ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయినట్టు తెలిపారు. ఘటనస్థలంలో వీఆర్వో షబాస్టిన్, ఆర్‌ఐ శివయ్య పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల శవాగారానికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పెదకాకాని: పొలం వెళ్తున్న రైతు లారీ ఢీకొని మరణించిన సంఘటన మంగళవారం నంబూరులో చోటు చేసుకుంది. నంబూరు గ్రామానికి చెందిన తియ్యగూర అప్పిరెడ్డి (50) మంగళవారం ఉదయానే టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై పెసర చేను వద్దకు బయలు దేరారు.వ గ్రామ శివారులో తారు లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్లబండ్లను తప్పించేందుకు లారీ డ్రైవర్ ఒక్కసారిగా వెనక్కి పోనిచ్చాడు. లారీ వెనుక టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై ఉన్న అప్పిరెడ్డి కేకలు వేస్తున్నప్పటికీ లారీలో టేప్‌రికార్డర్ ఆన్‌చేసి ఉండటంతో డ్రైవర్ వినిపించుకోలేదు. లారీ స్పీడుగా వెనక్కి రావడంతో వెనుక టైర్లు అప్పిరెడ్డిపైకిఎక్కాయి. అక్కడికక్కడే అప్పిరెడ్డి మృతి చెందారు. మృతునికి భార్య వెంకటరత్నం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు.
ఆటో బోల్తా..
తాడికొండ : ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతి చెంద డంతోపాటు, మరో పదిమందికి గాయాలైన సంఘటన మంగళవారం తుళ్లూరు మండలం పెదపరిమి, తాడికొండ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఎస్‌ఐ యం.సుబ్బారావు కథనం మేరకు నెక్కల్లు గ్రామం నుంచి మిర్చి కోతల నిమిత్తం 11 మంది ఆటోలో రావెల గ్రామానికి వెళ్తుండగా ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కందకంలో పడింది. నెక్కల్లు గ్రామానికి చెందిన కొల్లిపర్త సునంద(52) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను జీజీహెచ్‌కు తరలించారు. గాయపడినవారిలో మృతురాలి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. నెక్కల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రోసూరు : బైక్ కొన్న ఆనందంలో పూటుగా మద్యం తాగి నడపడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రోసూరు మండల కేంద్రం నుంచి అనంతవరం గ్రామానికి వెళ్లే దారిలో మోడల్ స్కూల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలంలో సేకరించిన వివరాల మేరకు అచ్చంపేట మం డలం మిట్టపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి రామకృష్ణ, నరేష్ కొత్త బైక్ కొనుగోలు చేసిన సందర్భంగా పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ క్రోసూరు నాలుగురోడ్లసెంటర్‌లో అదుపుతప్పి పడిపోయారు. స్థానికులు వారిద్దరినీ లేపి పంపించేశారు. తర్వాత అనంతవరం మీదుగా మిట్టపాలెం వైపు వెళ్తూ మోడల్ స్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న అందుకూరుకు చెందిన పాలవ్యాన్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో రామకృష్ణ తలకు బలమైన గాయమైంది. నరేష్ కాలు విరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు వారిని 108 వాహనం ద్వారా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి, అక్కడినుండి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో రామకృష్ణ మృతిచెందాడు. నరేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పాలవ్యాన్ డ్రైవర్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడన్నారు. తొలుత 108 వాహనం అందుబాటులో లేక ఆస్పత్రికి తరలించడం బాగా ఆలస్యమైందని చెప్పారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు
చేబ్రోలు: చేబ్రోలు మండలం నారాకోడూరు శివారులో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు(30) మరణించాడు. తలకు, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మారం మధ్యలో మరణించాడు. మంగళగిరి నుంచి గుంటూరుకు, గుంటూరు నుంచి పర్చూరుకు, అక్కడ నుంచి యడ్లపాడుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిం చిన ట్టు మృ తుని జేబులో టికె ట్లు ఉన్నాయి. ఎస్ ఐ షేక్ నా గుల్‌మీరా సా హెబ్ దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement