మిర్యాలగూడ/ చౌటుప్పల్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా రబీ సాగుకు సిద్ధమైన రైతాంగాన్ని అప్పుడే కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తమాటే అయ్యింది. సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టు పరిధిలోనూ వరి నార్లు పోసుకోవడంతోపాటు నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో సాధారణ వరి సాగు 4.5 లక్షల ఎకరాలు కాగా రబీలో సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులో కూడా ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 2.95 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో తొమ్మిది వేల కనెక్షన్లు పేయింగ్ జాబితాలో ఉండగా మిగతావి ఉచిత విద్యుత్ వినియోగదారుల జాబితాలో ఉన్నాయి. 7గంటలు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఐదు గంటలు మించడం లేదు. అధికారికంగా రాత్రి పూట 3గంటలు, పగటిపూట 4గంటలు ఇస్తున్నామని చెబుతున్నా, పగటి పూట గంట నుంచి 2గంటల వరకు కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా చేసిన సమయంలోనూ ఎన్నో సార్లు వచ్చిపోతోంది. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్, అల్లాపురం, డి.నాగారం, మల్కాపురం గ్రామాల్లో కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారు. నారుమళ్లు, దుక్కులు ఎండిపోయే దశకు చేరాయి. లోఓల్టేజీతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలి పోతున్నాయి. ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. ట్రాన్స్‌కో సిబ్బంది మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రైతులే ఫ్యూజులు వేసుకుంటున్నారు.
షెడ్యూల్‌లోనూ కోత
విద్యుత్ ఫీడర్లు, సబ్‌స్టేషన్ల వారీగా విద్యుత్ సరఫరా వేళల షెడ్యూల్‌ను ట్రాన్స్‌కో అధికారులు ఇటీవల ప్రకటిం చారు. ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో ఉద యం మూడు, రాత్రి వేళలో మూడు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కానీ, ఆ సమయంలో పవర్ కట్ అయితే మరో సమయంలో సరఫరా చేయడం లేదు. దాంతో పవర్ ట్రిప్ అయిన సమయంలో తిరిగి విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల కేవలం 5 గంటలు మాత్రమే వ్యవసాయానికి సరఫరా అవుతున్నది.
మూతపడిన ఎస్‌పీఎం కేంద్రం..
చౌటుప్పల్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రం మూతపడింది. కేంద్రం నడపలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. రెండు నెలలు కావస్తున్నా ఈ కేంద్రాన్ని కొత్త వారికి కేటాయించలేదు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడంతో మరమ్మతుల కోసం రైతులు రామన్నపేటకు తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు, మరమ్మతుల కేంద్రంలో సిబ్బందికి ఇచ్చే మామూళ్లు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ తీసుకెళ్లిన వెంటనే, స్పేర్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇవ్వాలి. కానీ, స్పేర్‌లో లేవంటూ, మరమ్మతుల కోసం వచ్చిన వాటిని సీరియల్‌గా మరమ్మతులు చేస్తున్నామని, మూడు రోజుల తర్వాత ఇస్తున్నారు.
మరమ్మతు ఖర్చులు మోపెడు..
విద్యుత్ మోటార్ల మరమ్మతుల ఖర్చు లు అమాంతం పెరిగాయి. మోటారు మరమ్మతు చేయాలంటే *4వేల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది రైతుల సాగుకు అదనపు భారంగా మారింది.
ఎండేనా.. పండేనా..?
Published Tue, Jan 7 2014 5:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM
Advertisement