low voltage
-
నెర్రెలు బారిన పొలాలు
ఖానాపూర్ : మండలంలో సుమారు 1000 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. బాధన్‌కుర్తి, బీర్నం ది, పాత ఎల్లాపూర్, మందపల్లి, దిలావర్పూర్ తదితర గ్రామాల్లో వర్షాధార ంపై ఆధారపడి సాగు చేసిన పంటలు ఇప్పటికే ఎండిపోగా, వ్యవసాయ బావుల కింద సాగు చేసిన కొద్ది పాటి పంటలు కూడా విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతున్నాయి. దీనికి తోడు లోవోల్టేజీ సమస్యతో తరచూ మోటార్లు కాలిపోవడంతో ఆర్థిక భారం పడుతోంది. వేళాపాల లేని కరెంటు కోతలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల అధికారులు ఏడుగంటలకు బదులు నాలుగు గంటలకు కుదించినా, కనీసం రెండుగంటలైనా సరఫరా ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కార్యాలయాలు ముట్టడించి, పర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల అర్ధరాత్రి సైతం రైతులు కార్యాలయాల వద్ద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సాగు భారమైనా.. సాగు భారమైనా రైతులు ఆయిలింజిన్లు, జనరేటర్లతో పంటలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. వేసిన పంట చేతికస్తుందో లేదోననే ఆందోళన రైతుల్లో తీవ్రమైంది. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే చూడలేక సాగు నీటిని పంటకు అందించేందుకు రైతులు అదనపు భారమైన కొత్త జనరేటర్లు కొనుగోలు చేస్తు న్నారు. చి‘వరికి’ పంట చేతికందేవరకు దే వుడిపైనే భారం వేసి ఆదాయానికి మించి పెట్టుబడి పెడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి ఎడాపెడా విద్యుత్ కోతలను భరించలేక పలువురు రైతులు రూ. 20 వేలకుపైగా వెచ్చించి ఆయిలింజిన్లు, జనరేటర్ కొనుగోలు చేసి పంటలకు నీరందిస్తున్నారు. మరికొందరు అద్దెకు తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతు ఆయిలింజిన్, జనరేటర్ కొని అదనపు భారం మోస్తున్నాడు. ఒక గంట ఆయిలింజన్ నడవాలంటే లీటర్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘సెస్'లో చేతివాటం!
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) స్టోర్స్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి స్టోర్‌కు తీసుకొస్తే లంచం ఇస్తేగానీ కొత్తవి ఇవ్వడం లే దు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పొట్టకొచ్చిన పొలా లు తడారిపోతున్నాయి. అసలే ఐదుగంటల కరెంటు... అది కూడా లోవోల్టేజీ.. తరచూ ట్రిప్పింగ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. సెస్ పరిధిలో నిత్యం ఏడు ట్రాన్స్ఫార్మర్ల వరకు కాలిపోతుండగా రిపేరు చేసి ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. కాసులిచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తుండడంతో సామాన్య రైతులు అసహనానికి గురవుతున్నారు. సిరిసిల్ల డివిజన్లోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండలాల్లోని విద్యుత్ వినియోగదారులకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఉరుపులుమెరుపులతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాలిన 24 గంటల్లో మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాల్సి ఉండగా రిపేర్లలో జాప్యంతో రోజుల తరబడి ట్రాన్స్ఫార్మర్లు బిగించలేకపోతున్నారు. హెల్పర్లు రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి స్టోర్స్‌లో సిబ్బందికి రూ.2 వేలు ఇస్తూ వెంటనే ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్తున్నారు. ఈ పైరవీ తెలియడం చేయని సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి ట్రాన్స్ఫార్మర్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేల వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ తరలింపునకు సైతం హెల్పర్ల చేయి తడపాల్సిందే. సెస్‌లో రెండు వ్యాన్లు ఉండగా, ఇటీవల మరో ట్రాక్టర్ అద్దెకు తీసుకున్నారు. వీటి ద్వారా ఆయా గ్రామాలకు ట్రాన్స్ఫార్మర్లు తరలించాల్సి ఉండగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ అద్దె పేరిట రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే దాని పరిధిలోని ఒక్కో రైతుకు రూ.500 వరకు భారం పడుతోంది. డబ్బులివ్వకుంటే ట్రాన్స్ఫార్మర్ రావడం ఆలస్యమై పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో అసహాయ స్థితిలో అన్నదాతలు డబ్బులిస్తున్నారు. కొత్తవి కొనుగోలు చేస్తున్నా.. సెస్ పరిధిలో 5,800 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా సగటున నిత్యం ఏడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. గత నెలలో 234 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, ఈ నెలలో ఇప్పటివరకే 173 కాలిపోయాయి. రోజుకు ఐదు ట్రాన్స్ఫార్మర్లు, మూడు షెడ్లలో రిపేరు చేస్తున్నారు. రిపేరవుతున్న ట్రాన్స్ఫార్మర్లు సరిపోవడం లేదు. ఇటీవల అధికారులు రూ.రెండు కోట్లతో 200 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ప్రతిపాదించారు. ఈ మధ్యే 20 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి. వచ్చే నెలలో మరో ఇరవై ట్రాన్స్ఫార్మర్లు రానున్నాయి. కొత్తవి వస్తున్నా కొరత తీరడం లేదు. నిజానికి 60 కేవీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్‌లోడ్‌తో పని చేస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యం మేరకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా ఉచిత కరెంటు కావడంతో నియంత్రణ లేకుండా కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా కొత్తవి కొనుగోలు చేస్తున్నా సరిపోవడం లేదు. -
నల్లమలకు సోలార్ వెలుగులు
* 16 సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా * 10గంటల్లో 5 మెగావాట్ల విద్యుదుత్పత్తి * ట్రయల్న్ సక్సెస్ అచ్చంపేట రూరల్ : నల్లమలకు వారం రోజుల్లో సోలార్ వెలుగులు రాబోతున్నాయి. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ శి వారులో సుమారు 30కోట్లతో దాదాపు 24 ఎకరాల్లో ప్రభుత్వం చేపడుతున్న పనులు పూర్తికావచ్చాయి. చిన్నచిన్న పనులు పూర్తయి వారంపదిరోజుల్లో ప్లాంట్ అందుబాటులోకి రానుంది. సోలార్ ప్లాంట్ నుంచి సౌరశక్తిని ఉపయోగించి సూర్యోదయం నుంచి సూ ర్యాస్థమయం వరకు 10 గంటల్లో రోజు కు 5 మెగావాట్ల విద్యుత్‌ను తయారుచేసే సామర్థ్యంగల యంత్రాలను అమర్చారు. నియోజకవర్గంలోని 16 సబ్‌ష్టేషన్లఅను అనుసందానం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంతో పాటు మండలంలోని పరిసరగ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా కానుంది. పనులు ఇలా.. నియోజకవర్గంలో లోఓల్టేజీతోపాటు విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను అందుబాటులో ఉంచడానికి సంకల్పించింది. మండలంలోని లక్ష్మాపూర్, నడింపల్లి, ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామాలకు ప్లాంట్లను మంజూరు చేసిం ది. ఒక్కోప్లాంట్‌కు దాదాపు 30 కోట్ల వరకు వ్యయం అంచనావేసి ముంబైకి చెందిన ఎస్ఎల్ మైనింగ్ కంపెనీకి పనులను అప్పగించింది. వారికిచ్చిన గడువు ప్రకారం ఈ ప్లాంట్లు గతనెల 30వ తేదీనాటికే వినియోగంలోకి తేవాల్సి ఉండగా పనులు సకాలంలో జరుగకపోవడం, యంత్రాలు రాకపోవడంతో మరో వారం పట్టవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. 24గంటల విద్యుత్ పనులు పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి రోజు నిరంతరాయం గా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉం టుందని ట్రాన్స్‌కో ఏడీ ఈ తావుర్యానాయక్ తెలిపారు.16 సబ్స్టేషన్ల పరిధిలో సోలార్‌ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. లక్ష్మాపూర్ గ్రామశివారులోని ప్లాంట్ పనులు పూర్తవగా, నడింపల్లిలో మరో ప్లాంట్ ఏర్పాటుకు స్థలం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని, అలాగే ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామంలో స్థలం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఈ పనులు సైతం సకాలంలో పూర్తయితే నియోజకవర్గంలో విద్యుత్ సమస్య శాశ్వతంగా తీరుతుంది. మూడు రోజుల కిందట చేసిన ట్రయల్న్ ్రకూడా సక్సెస్‌కావడంతో అధికారికంగా పనులు ప్రారంభించాల్సి ఉంది. -
విద్యుత్ అధికారులపై రైతన్నల కన్నెర్ర
రామాయంపేట,న్యూస్‌లైన్: లోఓల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలి పంటలు ఎండిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిపల్లి, రామాయంపేట గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు మంగళవారం రామాయంపేట విద్యుత్ సబ్ స్టేషన్ గేటు మూసి, ధర్నా చేపట్టారు. కోమటి పల్లి శివారులోని 63హెచ్‌పీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్పై 23 మోటార్లు నడుస్తున్నాయన్నారు. ఇక్కడ వంద హెచ్‌పీల ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 100 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ కోసం ఆరునెలల క్రితం ఆరుగురు రైతులు ఒక్కొక్కరు రూ.6 వేల చొప్పున బ్యాంకులో చెల్లించినట్లు రైతులు తెలిపారు. అయినా ఆరునెలలు దాటినా ట్రాన్స్ ఫార్మర్ను అధికారులు ఇవ్వడం లేదన్నారు. బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు ఇవ్వకపోవడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లోఒల్టేజీతో రావడంతో ట్రాన్స్ఫార్మర్లతో పాటు బోరు మోటార్లు కాలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రామాయంపేట ఏఈ బాబయ్యకు రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించారు అనంతరం ఏఈ బాబయ్య రాత్రి ఏడు గంటలకు సబ్ స్టేషన్ వద్దకు వచ్చి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో రైతులు శీలం కిష్టారెడ్డి, జీవన్‌రెడ్డి, ఉప సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి, వెల్ముల సిద్దరాంలు, వార్డు సభ్యుడు బాలు, సంపత్,వెంకట్, దేవానందం, లంబాడి బాబు, కుమ్మరి స్వామి, కిష్టయ్య, పోచయ్య, మర్కు రాజు, ఎర్రం రాములు, కిష్టారెడ్డి, మల్లేశం, దోమకొండ సిద్దరాంలు పాల్గొన్నారు. పోతరాజుపల్లిలో అధికారుల దిష్టిబొమ్మ దహనం తూప్రాన్:గత ఐదురోజులుగా అరకొరగా సరఫరా చేస్తున్న కరెంటు వల్ల పంటలు ఎండిపోతున్నాయని అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోతరాజుపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు తూప్రాన్-గజ్వేల్ రహదారిపై విద్యుత్ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో చేట్లగౌరారం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి రోజుకు కేవలం రెండు గంటల పాటే విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఫలితంగా అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాల రైతుల పంటలు ఎండుముఖం పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు చెట్లగౌరం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయడంవల్లే సమస్య వస్తోందని, ఇమాంపూర్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయాలని కోరారు. రైతులకు 7 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న అధికారులు రెండు గంటలు కూడా అందించడంలేదన్నారు. వెంటనే 7 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ విద్యుత్ ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా ఇన్కమింగ్ సరఫరా లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. -
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరాతో పాటు లో ఓల్టేజీ సమస్యను తీర్చాలని సోమవారం మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి గ్రామాల రైతులు నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ అంజ య్యతో పాటు లైన్మన్లు రాంలు, టీ వేణు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ దశరథ్ను ఓ గదిలో నిర్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో రాత్రీపగలు కలిపి దశలవారీగా సుమారు ఐదు గంటలు సరఫరా చేసేవారని, అయితే వారం రోజులుగా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని వాపోయారు. సరఫరా అవుతున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం లో ఓల్టేజీతో సరఫరా అవుతోందని తెలిపారు. దీంతో వారం రోజులుగా మంతూరు, కాజీపేట, గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. వ్యవసాయ పంటలు దాదాపు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారించాలని విద్యుత్ శాఖ ఏడీతో పాటు ఏఈలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్తో పాటు లైన్మన్లను వివరణ కోరగా రెడ్డిపల్లి ఫీడర్ కెపాసిటీ కన్నా ఎక్కువ వినియోగం ఉండడంతో లో ఓల్టేజీతో పాటు తరచూ సబ్‌స్టేషన్‌లో ట్రిప్ కావడం జరుగుతోందన్నారు. రైతులు సమస్యల ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తమ చేతిలో ఏమీ లేదన్నారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు లేకుండా రాస్తారోకోలు చేయకూడదని రైతులకు సూచిం చారు. సమస్యలుంటే అధికారుల వద్దకు వెళ్లి చెప్పుకోవాలన్నారు. రైతులు తమ పరిస్థితులను వివరిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ మొబైల్లో రాస్తారోకో ఫొటోలను తీశారు. అప్పటి వరకు ట్రాన్స్‌కో అధికారుల తీరును ఎండగట్టిన రైతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా రాస్తారోకో చేసినందుకు, అధికారులను నిర్బంధించిన విషయంలో ఆరుగురు రైతులు, మరో కొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ఎండేనా.. పండేనా..?
మిర్యాలగూడ/ చౌటుప్పల్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా రబీ సాగుకు సిద్ధమైన రైతాంగాన్ని అప్పుడే కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తమాటే అయ్యింది. సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టు పరిధిలోనూ వరి నార్లు పోసుకోవడంతోపాటు నాట్లు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో సాధారణ వరి సాగు 4.5 లక్షల ఎకరాలు కాగా రబీలో సాగర్ ఆయకట్టుతోపాటు నాన్ ఆయకట్టులో కూడా ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2.95 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో తొమ్మిది వేల కనెక్షన్లు పేయింగ్ జాబితాలో ఉండగా మిగతావి ఉచిత విద్యుత్ వినియోగదారుల జాబితాలో ఉన్నాయి. 7గంటలు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఐదు గంటలు మించడం లేదు. అధికారికంగా రాత్రి పూట 3గంటలు, పగటిపూట 4గంటలు ఇస్తున్నామని చెబుతున్నా, పగటి పూట గంట నుంచి 2గంటల వరకు కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా చేసిన సమయంలోనూ ఎన్నో సార్లు వచ్చిపోతోంది. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్, అల్లాపురం, డి.నాగారం, మల్కాపురం గ్రామాల్లో కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారు. నారుమళ్లు, దుక్కులు ఎండిపోయే దశకు చేరాయి. లోఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలి పోతున్నాయి. ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. ట్రాన్స్‌కో సిబ్బంది మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రైతులే ఫ్యూజులు వేసుకుంటున్నారు. షెడ్యూల్లోనూ కోత విద్యుత్ ఫీడర్లు, సబ్స్టేషన్ల వారీగా విద్యుత్ సరఫరా వేళల షెడ్యూల్‌ను ట్రాన్స్‌కో అధికారులు ఇటీవల ప్రకటిం చారు. ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో ఉద యం మూడు, రాత్రి వేళలో మూడు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. కానీ, ఆ సమయంలో పవర్ కట్ అయితే మరో సమయంలో సరఫరా చేయడం లేదు. దాంతో పవర్ ట్రిప్ అయిన సమయంలో తిరిగి విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల కేవలం 5 గంటలు మాత్రమే వ్యవసాయానికి సరఫరా అవుతున్నది. మూతపడిన ఎస్పీఎం కేంద్రం.. చౌటుప్పల్‌లోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రం మూతపడింది. కేంద్రం నడపలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. రెండు నెలలు కావస్తున్నా ఈ కేంద్రాన్ని కొత్త వారికి కేటాయించలేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడంతో మరమ్మతుల కోసం రైతులు రామన్నపేటకు తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు, మరమ్మతుల కేంద్రంలో సిబ్బందికి ఇచ్చే మామూళ్లు రైతులకు తడిసి మోపెడవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లిన వెంటనే, స్పేర్‌లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఇవ్వాలి. కానీ, స్పేర్‌లో లేవంటూ, మరమ్మతుల కోసం వచ్చిన వాటిని సీరియల్‌గా మరమ్మతులు చేస్తున్నామని, మూడు రోజుల తర్వాత ఇస్తున్నారు. మరమ్మతు ఖర్చులు మోపెడు.. విద్యుత్ మోటార్ల మరమ్మతుల ఖర్చు లు అమాంతం పెరిగాయి. మోటారు మరమ్మతు చేయాలంటే *4వేల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది రైతుల సాగుకు అదనపు భారంగా మారింది.