బాబు వస్తేనే జాబ్ వస్తుందంటూ ఆర్భాటపు ప్రచారాలతో ఎన్నికల్లో లబ్ధి పొందిన సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అధికారం చేపట్టిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోయారు. కొత్తగా జాబ్‌లివ్వడం దేవుడెరుగు.. ఉన్నోళ్లను సైతం తొలగిస్తూ, కాంట్రాక్టు ఉద్యోగులకు షాకులు ఇస్తుండడంతో బాధిత ఉద్యోగులే కాదు ప్రజలు సైతం నివ్వెరపోతున్నారు. రేషన్ డీలర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా ఒక్కొక్క విభాగం వారిని తొలగిస్తూ వస్తుండడం గమనార్హం. తాజాగా శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీలో పదేళ్లుగా పనిచేస్తున్న 49 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.
శ్రీకాళహస్తి: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత శ్రీకాళహస్తిలో కాంట్రాక్టు ఉద్యోగు ల తొలగింపు సర్వత్రా చర్చగా మారింది. పదేళ్లుగా పనిచేస్తున్న వారిని సైతం శాఖల వారీగా తొలగిస్తూ కడుపు కొడుతున్నారని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వివిధ విభాగాలకు సంబంధించి 581 వుందిని తొలగించారు. తాజా గా శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీలో 49 వుందికి ఉద్వాసన పలికారు. ఈ ఘటనతో నియోజకవర్గానికి సంబంధించి తొలగింపు జాబి తా 581 వుందికి చేరుకుంది. బాధిత ఉద్యోగులంతా కాళహస్తిలో కనిపించిన టీడీపీ నాయుకుడి ఇళ్లకు వెళ్లి తమను కొనసాగించాలంటూ ప్రాదేయపడుతున్నారు. వుంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఇద్దరు టీడీపీ వుుఖ్యనేతలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో చక్రం తిప్పు తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి.
తొలగింపు ఇలా..
ఈ ఏడాది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 581 వుంది కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపు జాబి తాలో చేరిపోయారు. ఉపాధి హామీలో 116 వుంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 132 వుంది ఆదర్శరైతు లు, 74 వుంది రేషన్‌డీలర్లు, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, నలుగురు ఆయూలను, 90వుంది వుున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, 30వుంది పట్టణ ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగులు, దేవస్థానంలో పనిచేసున్న 30 వుంది ఉచిత సేవకులు, 14 వుంది కాంట్రాక్ట్ సిబ్బంది, 40వుంది సెక్యూరిటీ సిబ్బంది ఇలా ఈ జాబితా నిండిపోయింది. తాజాగా స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచిం గ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆ లిస్టులోకి ఎక్కారు. వుహానుభావుల (టీడీపీ నాయుకుల) వునసులో ఇంకా ఏఏ విభాగాలున్నాయో ఆ శివయ్యుకే ఎరు క అని మిగతా విభాగాల వారు వాపోతున్నారు.
వీధిన పడేస్తున్నారు !
Published Wed, Oct 28 2015 2:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement