చిన్నప్పన్నకే ‘మత్స్యకార’ పీఠం | District Fishermen Cooperative Society Elections YSR Congress Party Supporter Barry cinnappanna | Sakshi
Sakshi News home page

చిన్నప్పన్నకే ‘మత్స్యకార’ పీఠం

Published Tue, Jan 6 2015 3:12 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

చిన్నప్పన్నకే ‘మత్స్యకార’ పీఠం - Sakshi

చిన్నప్పన్నకే ‘మత్స్యకార’ పీఠం

విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా మత్స్యకార సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు బర్రి చిన్నప్పన్న ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించి అధ్యక్ష పదవి ని  చేజిక్కించుకున్నారు. మొత్తం 11 మంది డెరైక్టర్ లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. చిన్నప్పన్నకు ఆరు ఓట్లు, టీడీపీ మద్దతిచ్చిన మురుము ల నాయుడుకు ఐదు ఓట్లు దక్కాయి. దీంతో బర్రి చిన్నప్పన్న జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పార్వతీపురం ఎఫ్‌డీఓ పి.కిరణ్‌కుమార్ ప్రకటించారు. ఉపాధ్యక్షునిగా దా సరి లక్ష్మణరావు  ఒక్కరే నామినేషన్ వేయటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
 
 రెం డు మార్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లలో నాటకీయ పరిణామాల నడుమ వాయిదా పడిన జిల్లా మత్స్యకా ర సహకార సంఘం ఎన్నిక ఎట్టకేలకు పూర్తయ్యింది. అయితే ఈ సారి గతంలోలా టీడీపీ నాయకుల ప్రలోభాలు పనిచేయలేదు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో గల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో సోమవారం  జి ల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఈ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తొలుత అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మద్దతు దారు బర్రి.చిన్నప్పన్న అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కేంద్రమం త్రి అశోక్ బంగ్లా నుంచి మంతనాలు ప్రారంభించారు.
 
 11 మంది డెరైక్టర్‌లలో టీడీపీ మద్దతుదారులైన ఇద్దరు డెరైక్టర్‌లు మీతో మాట్లాడేందుకు విజయనగరం ఎమ్మె ల్యే మీసాల గీత రమ్మన్నారంటూ కొందర్ని బలవంతం చేశారు. అయితే చిన్నప్పన్న, అతని మద్దతు దారులు ఎన్నికలు జరిగే ప్రాంగణం నుంచి వచ్చేది లేదని తెగేసి చెప్పటంతో చేసేదే మీ లేని ఇద్దరు డెరైక్టర్ మళ్లీ బంగ్లా కు తిరుగుముఖం పట్టి ప్రలోభాలను ముమ్మరం చేశా రు. ఈ నేపథ్యంలో ఎక్కడ పరిస్థితి  చేయిదాటిపోతుం దోనన్న భయంతో విజయనగరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సభ్యుడు టి.రమణ ఎన్నికల ప్రాం గణం వద్దకు వచ్చి కాసేపు హడావుడి చేశారు. అయితే మీడియా ప్రతినిధులు చూసి కాసింత వెనక్కి తగ్గిన జెడ్పీటీసీ రమణ ఎన్నికల ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐను ‘మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఫోన్ చే యమన్నార’ంటూ సమాచారం అందించాడు.
 
 మరో ఐదు నిమిషాల వ్యవధిలో అదే ఎస్‌ఐ డెరైక్టర్‌లంతా భో జనాలు చేసి రావాలని మధ్యాహ్నం 3 గంటలకు అధ్య క్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తామని అక్కడి నుంచి వారిని పంపించారు. దీంతో ఎన్నికల ప్రాంగణం నుంచి డెరైక్టర్‌లు బయటకు రాగానే టీడీపీ నాయకులకు చెందిన రెండు వాహనాల్లో చిన్నప్పన్న మినహా పలువురు డెరైక్టర్‌లను బంగ్లాకు తీసుకువెళ్లారు. అక్కడ వారికి పార్టీ కండువాలు వేసి, ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల సమయానికి మళ్లీ తీసుకువచ్చారు. అయితే డెరైక్టర్‌లంతా రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి చిన్నప్పన్నను ఒ క్క ఓటు మెజార్టీతో గెలిపించారు. అయితే ఇంత జరి గినా అక్కడి పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. చిన్నప్పన్నకు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అభినందనలు తెలిపారు.  
 
 అందరినీ కలుపుకుని ముందుకు వెళతా: బర్రి చిన్నప్పన్న
 జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి అందరినీ కలుపుకు ని ముందుకు వెళతానని జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన బర్రి చిన్నప్పన్న తెలి పా రు.  ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులే  ఎన్నికలకు రాజ కీయ రంగు పులిమారని అయితే తాను మాత్రం రాజకీయాలకు అతీతంగా 11 మంది డెరైక్టర్‌ల సహాయ, సహకారాలతో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement