అదే ప్యాకేజీ టీడీపీ నేతలకిస్తారా? | do you give that package to tdp members? | Sakshi
Sakshi News home page

అదే ప్యాకేజీ టీడీపీ నేతలకిస్తారా?

Published Fri, Mar 20 2015 2:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

అదే ప్యాకేజీ టీడీపీ నేతలకిస్తారా? - Sakshi

అదే ప్యాకేజీ టీడీపీ నేతలకిస్తారా?

హైదరాబాద్ : మా ప్రభుత్వం వస్తే...బలవంతంగా లాక్కున్న భూములను రైతులకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని పరిధిలోని రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం నిలిపి వేయాలన్నారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్మీట్లో మాట్లాడుతూ  అధికారం శాశ్వతం కాదని ఎన్నికలు వస్తాయని‌..ఇదే ప్రజలు టీడీపీని బంగాళాఖాతంలోకి కలుపుతారని అన్నారు.

వ్యవసాయం చేసుకుంటారో, వ్యాపారం చేసుకుంటారో అనే విషయాన్ని రైతులకే వదిలేయాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.  భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే టీడీపీ నేతల భూములకు ఇవ్వగలరా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలకు మనసు లేదని రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement