వైద్యుల నిర్లక్ష్యంతో విశాఖ కేజీహెచ్లో రోగి మృతి
Published Thu, Jan 23 2014 7:25 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
విశాఖపట్నం: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో రోగి మృతి చెందిన సంఘటన విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. రోగి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు వైద్యులను వేడుకున్నారు. అయితే రిపోర్టులు వస్తేగాని చికిత్స అందించలేమని వైద్యులు వెల్లడించినట్టు తెలిసింది.
రోగిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు ఉదయం 8గంటలకు తీసుకవస్తే.. ఆస్పత్రి వైద్యులు సాయంత్రం వరకూ పట్టించుకోలేదు. దీంతో రోగి సాయంత్రం వరకూ స్ర్టెచర్ పైనే నరకయాతన అనుభవించినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందక రోగి పరిస్థితి విషమించి.. ఆస్పత్రి ప్రాంగణంలోనే కుటుంబ సభ్యుల కళ్లెదుటే తుది శ్వాస విడిచాడు. దాంతోడాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వైద్యుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement