‘డాలర్ల’ పూదోటలో నష్టాల ముళ్లు | 'Dollars' damages skipping pudotalo | Sakshi
Sakshi News home page

‘డాలర్ల’ పూదోటలో నష్టాల ముళ్లు

Published Sat, Jun 14 2014 2:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

‘డాలర్ల’ పూదోటలో నష్టాల ముళ్లు - Sakshi

‘డాలర్ల’ పూదోటలో నష్టాల ముళ్లు

  •      డిమాండ్ కోల్పోయిన కుప్పం రోజా
  •      విదేశీ మార్కెట్లో పతనమైన ధర
  •      పూల నాణ్యతలో లోపమే శాపం
  •      నీళ్లు చాలక కళావిహీనమైన గ్రీన్‌హౌస్‌లు
  • కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 40 పైగా గ్రీన్‌హౌసుల్లో రైతులు రోజా పూలతోటలు సాగు చేస్తున్నారు. విదేశాల్లో గత ఏడాది వరకు కుప్పం రోజా పూలకు డివూండు అధికంగా ఉండేది. రైతులు కూడా రోజా పూలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి ధర పలికినప్పుడు విదేశాలకు ఎగువుతి చేశారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా తయరయింది. గత ఏడాది  రోజా పువ్వు ధర రూ.150-200లు పలికింది. ఈ ఏడాది దాని ధర రూ.50 నుంచి రూ.100లోపే ఉంది. అంటే విదేశీ వూర్కెట్లో కుప్పం పూలకు డిమాండు తగ్గిపోయింది. గతంలో బాగా లాభాలు చవిచూడడమేగాకుండా, గ్రీన్‌హౌస్‌లో ఒకసారి ఏ పంట సాగుచేస్తే కొన్నేళ్లపాటు అదే పంటసాగు చేయాలి. దీంతో రైతులు గిట్టుబాటు ధరలేని రోజా పూలతోటలు సాగుచేయలేక, వురో పంటసాగుచేయలేక అయోమయాంలో పడ్డారు.
     
    ఖర్చులెక్కువ
     
    గ్రీన్‌హౌస్‌లో రోజా పూలు సాగుచేయాలంటే ఖర్చు భారీ ఎత్తున ఉంటుంది. గ్రీన్‌హౌస్ ఏ ర్పాటుకే 10 లక్షలు పైబడుతుంది. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తుంది. మిగతా ఖర్చు మొత్తం రైతు భరించాల్సిందే. పూలసాగుకు ఎకరానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. రోజూ ఇద్దరు ముగ్గురు కూలీలు గ్రీన్‌హౌస్‌లో పనిచేయాలి. వీరి కూలి భరించాలి. కోసిన పూలను కోల్డ్‌స్టోరేజిలో ఉంచాలి. అందుకు అద్దె ఇవ్వాలి. తరువాత మార్కెట్‌కు తరలించే ఖర్చు. ఇదంతా భరిస్తే చివరకు కష్టానికి తగిన ఫలితం రావడం లేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.  
     
    వెల్‌వెట్ పరిస్థితీ ఘోరం
     
    రోజాకు తోడు వెల్‌వెట్(కోడి జుట్టు) పూల ప రిస్థితి దారుణంగా తయారయింది. ఎకరా భూమిలో వెల్‌వెట్ పూలు సాగుచేస్తే 500 కిలోల నుంచి 600 కిలోల వరకు పూలుపూస్తాయి. కానీ ఈసారి 300నుంచి 400 కిలోలలో పే పూలు పూస్తున్నాయి. గతంలో ఒక కోతకు 25 వేల నుంచి 30 వేల రూపాయల దాకా గిట్టుబాటు అయ్యేది. ఈ ఏడాది వెల్‌వెట్ పూలు అడిగే నాథుడే లేదంటున్నారు రైతులు. కుప్పం మండల పరిధిలోని వెండుగంపల్లె గ్రామానికి చెందిన వుునెప్ప ఎకరం భూమిలో వెల్‌వెట్ పూలు అమ్ముకోలేక పొలంలోనే వదిలేశాడు. వారం కిందట ఓ బస్తా వెల్‌వెట్ పూలు స్థానిక వూర్కెట్‌కు తీసుకెళితే ఎవరు కొనలేదని నిరుత్సాహంతో వెనుతిరిగాడు.
     
    నీటి సమస్యతో నాణ్యత లోపం
     
    నాణ్యతలో లోపం ఏర్పడడంతోనే రోజా, వెల్‌వెట్ పూలు ధరలు పతనమయ్యూయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా పడకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా గ్రీన్‌హౌస్‌లో పూల మొక్కలకు నీటిని సరఫరాచేస్తే పూలలో నాణ్యత రావడంలేదు. గ్రీన్‌హౌస్‌లు కూడా కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
     
    నీటి కొరతతోనే ఇబ్బంది
    వానలు లేక బోర్లన్నీ ఎండిపోయూయి. గ్రీన్‌హౌస్‌లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించే నీరు పూలమొక్కలకు చాలడం లేదు. అందువల్లే పూలు నాణ్యతగా రాలేదు. దీనికితోడు కుప్పం నుంచి విదేశాలకు ఎగువుతి చేసేందుకు సౌకర్యాలు లేకపోవడం వల్ల రోజా పూలకు గిట్టుబాటు ధర రాలేకపోతోంది. మొదట్లో బాగున్న రోజా పూలసాగుతో ఇప్పుడు అనుకున్న స్థాయిలో లాభాలు రావడం లేదు.
     -తులసి,రైతు,కొత్తిండ్లు

     ధర లేకపోవడంతో పొలాల్లోనే వదిలేశాం
     వెల్‌వెట్ పూలను వూర్కెట్‌లో అడిగేవారు లేరు. వారం రోజుల కింద ఒక పూట పూలు మార్కెట్‌కు ఎత్తుకుని పోతే తీసుకునేవారు లేక అక్కడే పారబోసి వచ్చాం. రే ట్లు లేకపోవడంతో పూలు కోయులేక పొలాల్లోనే వదిలేశాం. గత ఏడాదికంటే ఈ దఫా సాగుచేసిందే తక్కువ. కానీ,ఈ సారే నష్టాలు ఎక్కువ.
     -పుంగోడి,వెండుగంపల్లె
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement