పరభాషల్లో ప్రావిణ్యం సంపాధించడం ముఖ్యమేనని, అయినా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని ఎస్పీ ఎం.రమేష్ విద్యార్థులకు సూచించారు.
నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: పరభాషల్లో ప్రావిణ్యం సంపాధించడం ముఖ్యమేనని, అయినా మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని ఎస్పీ ఎం.రమేష్ విద్యార్థులకు సూచించారు. నరసాపురం మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాతనవరసపురంలో చిన్నారులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఏమి చదువుతున్నావ్ అని ఒక విద్యార్థిని ఎస్పీ ప్రశ్నించగా ఫోర్త్ క్లాస్ చదువుతున్నానని సమాధానమిచ్చాడు. దీనిపై స్పందించిన ఆయన నాల్గో తరగతి చదువుతున్నానని తెలుగులో చెప్పాలని సూచించారు.
ప్రతిజ్ఞ వచ్చా అని బాలుడ్ని ప్రశ్నించారు. ఇండియా ఈజ్ మై కంట్రీ అంటూ బాలుడు ప్రారంభించగా మధ్యలో ఆపి తెలుగులో చెప్పమని కోరారు. సమీపంలోని విద్యార్థులెవ్వరూ తెలుగులో ప్రతిజ్ఞ చె ప్పేందుకు ప్రయత్నించలేదు. అడ్డాల ఏసురాజు అనే బాలుడు తెలుగులో ప్రతిజ్ఞ చెప్పాడు. సంతోషించిన ఎస్పీ ఏసురాజుకు చిరు బహుమతి ఇచ్చారు.