బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : హైదరాబాద్ కేసీఆర్ అబ్బసొత్తు కాదని, ఆంధ్ర ఉద్యోగులని పంపిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హెచ్చరించారు. సమైక్యాం ధ్ర నాయకులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు బుట్టాయగూడెంలో జరిగిన కార్యక్రమంలో బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ అసలు నైజం బయటపడిందన్నారు. కేసీఆర్ ఓ నియంతలా మాట్లాడుతున్నారని, ఏ అధికారంతో మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. విభజన కాక ముందే హైదరాబాద్‌లోని ఆంధ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విభజన పూర్తయితే ఇంక ఏ విధంగా ఉంటారో కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ,యూపిఏ భాగస్వామ్య పక్షాలు తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని సమైక్య రాష్ట్ర ప్రజలు ఎంతో అభివృద్ధి చేశారని, ఏకపక్షంగా తెలంగాణాకు ఎలా ఇచ్చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా ఉంటున్నవారిని విడదీసి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న సోనియా, కేసీఆర్‌లు చరిత్ర ీహ నులుగా మిగిలి పోతారన్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకున్న శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రనే సూచిం చిందని, అయినా సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పీఠం ఎక్కించేందుకు రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడినాడ హరిబాబు, షేక్ బాజీ, సర్పంచ్ కంగాల పోసిరత్నం, కరాటం కృష్ణ స్వరూప్, ఆరేటి సత్యనారాయణ, రేపాకుల చంద్రం, కుక్కల సోమరాజు తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు
Published Tue, Aug 6 2013 1:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement