మాతృభాష.. ఘోష ! | Telugu language people are neglecting mother tongue | Sakshi
Sakshi News home page

మాతృభాష.. ఘోష !

Published Sat, Feb 10 2018 2:35 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Telugu language people are neglecting mother tongue - Sakshi

గోయగాంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ అని చెబుతారు. మాతృభాషపై మమకారం రోజురోజుకు తగ్గిపోతోం ది. తెలుగుభాష మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అందరూ ఆంగ్లం వైపే పరుగులు పెడుతున్నారు. అమ్మ భాషకన్నా పరాయిభాషపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. కాన్వెంట్‌ చదువుపై మనసు పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు భా ష మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో దేశంలో రెండో అతిపెద్ద భాషగా విరాజిల్లిన తెలుగు ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. మాతృభాషా పరి రక్షణకు చట్టం తెచ్చి దాన్ని ఆచరణలో పెడితేనే తెలు గుభాష ప్రాభవాన్ని కాపాడిన వారమవుతాం. 

కెరమెరి : తెలుగు మాధ్యమం ప్రాభవం నానాటికీ తగ్గిపోతోంది. పాఠశాల విద్యకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు అవసరమైన పుస్తకాలు ఇతర సామగ్రిని ఇవ్వడం, మధ్యాహ్న భోజనం అందించడం తదితర కార్యక్రమాలతో పాఠశాల విద్య పటిష్టానికి కృషి చేస్తుంది. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులున్నారు. మండలంలో 75 ప్రాథమిక పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 6తో కలిపి మొత్తం 91 పాఠశాలలున్నాయి.

ఇందులో 6150 మంది విద్యార్థులున్నారు. చాలామంది విద్యార్థులు సంవత్సరం మధ్యలోనే చదువు మానేస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మరోవైపు వీధికొక్కటి చొప్పున పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు కొత్త ఎత్తులతో విద్యార్థులను ఆకర్శిస్తున్నాయి. కొన్ని మినహా చాలా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఉత్తీర్ణతలో వెనుక బడుతున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల తల్లితండ్రులు సైతం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో మాతృభాషా తెలుగు మనుగడ ప్రమాదకర పరిస్థితిలో పడుతోంది. ప్రైవేటుకు ధీటుగా తయారు చేయాలి.

తెలుగుమాధ్యమంలో చదివితేనే..
ప్రభుత్వం తెలుగు మాధ్యమంలో చదువుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులనే నిబంధన తీసుకురావాలి. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో మార్పు తీసుకురావాలి. అప్పుడే మాతృభాషపై మమకారం పెరుగుతుంది. ఉపాధి కోసమైనా తెలుగు మాధ్యమంలో చేరే అవకాశముంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

నర్సరీ తరగతులు ప్రారంభించాలి
ప్రభుత్వం పాఠశాలల్లో నర్సరీ తరగతులను ప్రవేశ పెడితే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను సునాయాసంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ముందు నుంచే కసరత్తును ప్రారంభించాల్సి ఉంది.  తెలుగు మాధ్యమంలోనే విద్యాబో ధన సాగించాలనే నిబంధన పెట్టాలి. ఆంగ్ల మాధ్యమం పై ఉన్న ఆసక్తిని తగ్గించాలి. తెలుగులోనే విరివిగా అవకాశాలు కల్పించే విధంగా చట్టాలు రూపొందించాలి.

చైతన్యం పెరగాలి..
బడులు బాగా పని చేయాలంటే త ల్లి తండ్రుల్లో చైతన్యం పెరగాలి.విద్యార్థుల ప్రగతి, చదువు విధానం ఎప్పటి కప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నప్పడు ఉపాధ్యాయునిపై బాధ్యత పెరుగుతుంది. కాని పోషకులు మాత్రం ఎక్కడా సహకరించడం లేదు. క నీసం సమావేశాలకు పిలిస్తే కూడా రావడం లేదు.     
ఎం శ్రీనివాస్, డీటీఎఫ్, మండల ప్రధాన కార్యదర్శి  కెరమెరి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement