సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధనే ఉత్తమం. దీనివల్ల ఆయా సబ్జెక్టులపై సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఆంగ్ల మాధ్యమంతో అభివృద్ధి అనేది తల్లిదండ్రుల అపోహ మాత్రమే’ అని రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ వి.ఉషారాణి అన్నారు. ‘టీచ్ ఫర్ ఇండియా’ సంస్థ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యావిధానాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. హైదర్‌గూడలోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఉషారాణి... అన్ని తరగతులకు వెళ్లి విద్యార్థులతో సంభాషించారు. టీచ ర్లు పాఠాలు చక్కగా చెబుతున్నారా. మధ్యాహ్న భోజనం రుచిగా ఉం టుందా.. అందరికీ యూనిఫారాలు ఇచ్చారా... అంటూ ఆరా తీశారు.
నోట్‌బుక్‌లను పరిశీలించి, పలు అంశాలపై విద్యార్థులను ప్రశ్నించా రు. పదోతరగతి విద్యార్థులు తెలుగు సరిగా చదవలేకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో 70 మంది విద్యార్థుల గైర్హాజరీపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణం సకాలంలో పూర్తి చేయకపోవడడంపై ఆర్వీఎం పీవోను వివరణ కోరారు. అనంతరం ఉషారాణి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘టీచ్ ఫర్ ఇండి యా’ నగరంలోని 19 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తుందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. యూనిఫారాలందని విద్యార్థులకు వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆర్వీఎం హైదరాబాద్ జిల్లా ప్రాజెక్టు అధికారి సుబ్బారాయుడు, డిప్యూటీ ఈవో సురేష్, ‘టీచ్ ఫర్ ఇండియా’ ప్రతినిధులు సాహిల్ సూద్, రవితేజ పాల్గొన్నారు.
మాతృభాషతోనే మనోబలం
Published Wed, Sep 25 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement
Advertisement