తెలంగాణకు అడ్డుపడొద్దు :ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ | dont prevent to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అడ్డుపడొద్దు :ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Published Fri, Sep 6 2013 4:28 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

dont prevent to telangana

 సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీ మాంధ్రులు అడ్డుపడటం తగదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలెంల కిరణ్‌కుమార్ మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగలు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించేబోయే తెలంగాణ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని కోరుతూ గు రువారం సూర్యాపేట పట్టణంలో 5వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్, పూల సెంటర్, కోర్టు చౌరస్తా, ఈద్గా రోడ్డు, శంకర్‌విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాం ధ్ర పక్షపాతిగా మాట్లాడడం తగదన్నా రు.
 
 తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని స్పష్టం చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాలు నిర్వహించడం బాధాకరమన్నారు. తెలుగు ప్రజలంతా ఆత్మీయుల్లా కలిసి ఉండి అన్నదమ్ముల్లా విడిపోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బోడ శ్రీరాములు మాదిగ, యాతాకుల రాజయ్య మాదిగ, బొడ్డు సైదులుమాదిగ, భార్గవ్ మాదిగ, చింత సతీష్ మాదిగ, ఎం.రవి, లాజర్, క్రాంతి, శైలజ, జ్యోతి, కమలాకర్, రాము, రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement