ఏఈఈ పరీక్షల హాల్ టిక్కెట్లు సిద్ధం
హైదరాబాద్: వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షలకు హాల్‌టిక్కెట్లను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పేర్కొంది. ఈ హాల్ టిక్కెట్లను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటిని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.