మొగల్తూరు : మహిళా దినోత్సవం రోజున ఓ యువతి కట్నం దాహానికి బలైన ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం తేవాలని భర్త తరచూ వేధిస్తుండడంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. భీమవరం మండలం బావాయ్‌తిప్పకు చెందిన తిరుమాని రామాంజనేయులుకు దెయ్యాలతిప్పకు చెందిన మోకా పద్మశ్రీ (21)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన రామాంజనేయులు కుటుంబం వేట సాగించడం ద్వారా జీవనోపాధి పొందుతోంది. పెళ్లి సమయంలో పద్మశ్రీ కుటుంబ సభ్యులు తమకు ఉన్నదాంట్లో బాగానే కట్నాన్ని ముట్టజెప్పారు. అరుుతే అదనపు కట్నం తీసుకురావాలంటూ రామాంజనేయులు తరచూ పద్మశ్రీని వేధించడం మొదలుపెట్టాడు.
కొద్దిరోజులుగా ఈ వేధింపులు ఎక్కువ కావడంతో పద్మశ్రీ శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పద్మశ్రీ తల్లి మోకా దుర్గ, కుటుంబ సభ్యులు తమ కూతురిని కట్నం కోసం చంపేశారని కన్నీరుమున్నీరయ్యూరు. మృతురాలి తల్లి మోకా దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాంజనేయులు అతని కుటుంబ సభ్యులపై మొగల్తూరు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా భార్య మృతి చెందడం, పోలీసులు రావడంతో ఆందోళనకు గురైన రామాంజనేయులు ఆదివారం ఉదయం పరుగులమందు తాగాడు. దీంతో పోలీసులు తమ వాహనంలోనే హుటాహుటిన మొగల్తూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
కట్నం వేధింపులకు యువతి బలి
Published Mon, Mar 9 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement