పాండ్యానాయక్‌తండా (చివ్వెంల), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పాండ్యానాయక్‌తండాలో విషజ్వరంతో బుధవారం ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెంది న బానోతు శ్రీను(40) పదిహేను రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించి మంగళవారం తండాకు తీసుకువచ్చారు. కాగా, అర్ధరాత్రి మళ్లీ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై శ్రీను మృతి చెందాడు. అదేవిధంగా తండాకు చెందిన ధరావత్ పంతు లు (65) ధరావత్ అంజాని(70) విషజ్వరంతో బాధపడుతూ మంచం పట్టారు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
పాండ్యానాయక్ తండాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పం చాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వీధుల్లోనే మురుగునీరు నిలుస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు తండాకు తాగునీరు అందించే స్కీంబోరు మరమ్మతుకు గురికావడంతో శివారులోని చేతిపంపు నీటినే తండావాసులు తాగుతున్నారు. వర్షం వచ్చినప్పుడు మురుగునీరు భూమిలోకి ఇంకి తాగునీరు కలుషితమవుతోం దని వాపోతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
తండాను సందర్శించిన
వైద్యసిబ్బంది
పీహెచ్‌సీ సిబ్బంది బుధవారం తండాను సందర్శించారు. బానో తు శ్రీను మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి కరుణాకర్, సూపర్ వైజర్ లక్ష్మీ, ఎఎన్‌ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విషజ్వరంతో ఒకరి మృతి
Published Thu, Aug 29 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement