ఎదులాపురం, న్యూస్‌లైన్ : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ అఖిల భారత కౌన్సిల్ సమావేశాలకు దేశ నలుమూలల నుంచి బీజేపీ సీఎంలు, అగ్రనేతలు, వివిధ జిల్లాల నుం చి అధ్యుక్షులు తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కౌన్సిల్ సమావేశాల్లో కార్యకర్తలకు, నాయకులకు మార్గనిర్దేశనం చేశారన్నారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగంలో రెండో అంశంగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును పేర్కొనడం జరిగిందని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుం దని, మోడీ పీఎం కావడం ఖాయమన్నారు. మోడీ పరిపాలనలో దేశం వినూత్న రీతిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో 80 శాతం ఉన్న వ్యవసా యం 65 శాతానికి పడిపోయిందని తెలిపారు. జిల్లాలో బొగ్గు, పత్తి విస్తృతంగా ఉన్నప్పటికీ వాటి ఫలాలు జిల్లా కు అందడం లేదన్నారు. త్వరలో జిల్లా మేనిఫెస్టోను విడుదల చేసి రాష్ట్ర, జాతీయ నాయకులకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జిల్లాలో కూడా ఎదగడం ఖాయమని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర మోర్చా రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌నాయక్ మాట్లాడుతూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎస్టీ రిజర్వేషన్ ఉన్న స్థానాలన్నింటిలో బీజేపీ విజయఢంకా మోగించిందని, ఇది గిరిజనులు బీజేపీని విశ్వసించడానికి నిదర్శనమని పే ర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు నివేదిత వఝే, జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంతోష్, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు రవి, బీజేపీ యువ మోర్చా నాయకుడు విజయ్ పాల్గొన్నారు.
మోడీ పాలనలోనే అభివృద్ధి
Published Wed, Jan 22 2014 2:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement