ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలికి ఏపీ అడ్వకేట్ జనరల్ నివేదించినట్లు తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంసెట్ పరీక్షలు ఉమ్మడిగానే నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలికి ఏపీ అడ్వకేట్ జనరల్ నివేదించినట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఏజీ అభిప్రాయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
గతంలో ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ సర్కారు ప్రయత్నించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వేరుగా నిర్వహించేందుకే చర్యలు తీసుకున్నసంగతి తెలిసిందే. ఎంసెట్‌ను కూడా విడిగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ప్రభుత్వాన్ని కోరిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఎంసెట్ నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది.